SS Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా పేరును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో ఎక్కడలేని గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీ స్టారర్ మూవీ చేయొచ్చు. అది కూడా సక్సెస్ ఫుల్ నిలుస్తుందనే ఒక క్లారిటి ఇచ్చిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ రాజమౌళికి నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరు అనే ధోరణిలోనే ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. నిజానికి రాజమౌళి కి ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో సూర్య అంటే చాలా ఇష్టమట. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా సూర్య పడిన కష్టం…ఆయన ఒక నటుడిగా ఎదిగిన విధానం తన నటనలోని పరిణీతి అన్నీ అతనికి బాగా నచ్చుతాయట. తనతో ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికి అవి వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆయన సూర్య ను డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
వారణాసి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారబోతోంది. హాలీవుడ్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన సూర్యతో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇదంతా చూస్తున్న మరి కొంతమంది మాత్రం మన ఇండియన్ డైరెక్టర్ అయిన రాజమౌళి ఇండియన్ హీరోలతోనే సినిమాలు చేస్తే బాగుంటుందంటూన్నారు. హాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే సక్సెస్ వచ్చినా కూడా క్రెడిట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్తుందే తప్ప మనల్ని ఎవరు గుర్తించరు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి వారణాసి సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నాడు. కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా ఆయన చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సూర్యకు సంబంధించిన సినిమాని సైతం తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…
