https://oktelugu.com/

కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. ఆ సినిమా చేసినందుకే !

‘ఆర్ ఎక్స్ 100’ అనే బోల్డ్ సినిమాతో ఓవర్ నైట్ లోనే ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తో పాపులారిటీలోకి వచ్చాడు హీరో కార్తికేయ. నిజానికి ఈ సినిమా మనోడి రేంజ్ నే పూర్తిగా మార్చేసింది. ఆ మాటకొస్తే.. కార్తికేయ జీవితం ఆ సినిమాకి ముందు, ఆ సినిమాకి తరువాత అన్న మాదిరిగా తయారైంది. అంత గొప్ప హిట్ వచ్చిన తరువాత.. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు చేసానా అని ఈ హీరో తెగ ఫీల్ అవుతున్నాడట. కేవలం […]

Written By:
  • admin
  • , Updated On : March 28, 2021 / 05:14 PM IST
    Follow us on


    ‘ఆర్ ఎక్స్ 100’ అనే బోల్డ్ సినిమాతో ఓవర్ నైట్ లోనే ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తో పాపులారిటీలోకి వచ్చాడు హీరో కార్తికేయ. నిజానికి ఈ సినిమా మనోడి రేంజ్ నే పూర్తిగా మార్చేసింది. ఆ మాటకొస్తే.. కార్తికేయ జీవితం ఆ సినిమాకి ముందు, ఆ సినిమాకి తరువాత అన్న మాదిరిగా తయారైంది. అంత గొప్ప హిట్ వచ్చిన తరువాత.. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు చేసానా అని ఈ హీరో తెగ ఫీల్ అవుతున్నాడట.

    కేవలం ఆ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా వల్లే తనకు కండలు తప్ప నటన కష్టం అనే కామెంట్స్ తానూ ఎదుర్కోవాల్సి వచ్చిందని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అన్నట్టు ఆ ఇమేజ్ వల్లే తన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవ్వట్లేదు అని.. కచ్చితంగా భవిష్యత్తులో తనకు ఉన్న బోల్డ్ ఇమేజ్ ను మార్చుకుంటానని.. నిజానికి నేను నా ఇమేజ్ ను మార్చుకోవాలనే ఉద్దశ్యంతోనే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ పాత్రలో నటించాను అని తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు.

    అయితే విలన్ గా నటించినా నటుడిగా తనకు మంచి మార్కులు పడ్డాయి గానీ, తనకున్న బ్యాడ్ ఇమేజ్ మాత్రం పోలేదట. హీరోగా కూడా తన నటన చూపించాలని…ఎంతో కష్టపడి ‘చావు కబురు చల్లగా’ సినిమా చేశానని.. అయినా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అసలు ఆదరించలేదని.. అదే వేరే హీరో చేసి ఉంటే.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది అని తన ముందే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారని.. ఇలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు బాధగా ఉంటుందని.. సినిమాలో నేను పెట్టిన ఎఫర్ట్ ని గుర్తించకపోగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అని మొత్తానికి తన సినీ సన్నిహితులు దగ్గర చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడట.

    ఏది ఏమైనా మనోడు ఎంతో కష్టపడి చేసిన ‘చావుకబురు చల్లగా’ సినిమా మొత్తానికే తేడా కొట్టేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుకే పెట్టాబేడా సర్దేసేయాల్సి వచ్చింది. ఈ సినిమాని నిర్మించిన జీఏ2 పిక్చర్స్ కూడా రిలీజ్ తర్వాత కనీస ప్రొమోషన్ కూడా చెయ్యలేదు అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.