అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న హీరో !

సినిమా హీరో అనగానే కోట్ల సంపాదన అనుకుంటాం. వాళ్ల మీద ఎప్పుడూ అభిమానుల అభిమానంతో పాటు ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. హీరో అవ్వడం ఎంత కష్టమో, ఆ హీరో ఇమేజ్ ను మెయింటైన్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. పని లేకపాయినా చిన్నాచితకా హీరో కూడా నలుగురు సిబ్బందిని పెట్టుకోవాలి. లేకపోతే ఇండస్ట్రీ అతన్ని హీరోగా గుర్తించదు అని భయపడుతూ ఉంటారు సదరు హీరోలు. […]

Written By: admin, Updated On : June 6, 2021 11:36 am
Follow us on

సినిమా హీరో అనగానే కోట్ల సంపాదన అనుకుంటాం. వాళ్ల మీద ఎప్పుడూ అభిమానుల అభిమానంతో పాటు ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. హీరో అవ్వడం ఎంత కష్టమో, ఆ హీరో ఇమేజ్ ను మెయింటైన్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. పని లేకపాయినా చిన్నాచితకా హీరో కూడా నలుగురు సిబ్బందిని పెట్టుకోవాలి.

లేకపోతే ఇండస్ట్రీ అతన్ని హీరోగా గుర్తించదు అని భయపడుతూ ఉంటారు సదరు హీరోలు. ఇందులో నిజం కూడా ఉందనుకోండి. ఏది ఏమైనా సినిమా కష్టాలు ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసే అప్ కమింగ్ వారికే వుంటాయి తప్ప, పేరు ఉన్న హీరోలకు ఉండవు అనేది పూర్తిగా అబద్ధం. ప్రస్తుతం ఓ సీనియర్ హీరో పరిస్థితి చూస్తే అవకాశాలు తక్కువ, అప్పులు ఎక్కువగా ఉంది.

హీరోగా చాల సినిమాలు చేసాడు, తెలుగు- కన్నడ – తమిళ భాషల్లో సదా సినిమాలు చేసే హీరోగారు ఆయన. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. అయినా పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉందట. ఈయన కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ, సక్సెస్ మాత్రం కాలేకపోయింది. అయితే మేనల్లుడు మాత్రం కన్నడ చిత్రసీమలో అప్ కమింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం అతనే ఈ సీనియర్ హీరోని ఆర్ధికంగా ఆదుకున్నాడు. ఇంతకీ ఈ సీనియర్ హీరోకి సుమారు డెబ్భై కోట్లకు పైగా అప్పులు వున్నాయట. ఆ అప్పులకు కారణం సైడ్ బిజినెస్ అని తెలుస్తోంది. అయితే, సినిమా వాళ్ళ అప్పులకు వడ్డీ రేటు ఎక్కువుగా ఉంటుంది. ఈ హీరోకి వడ్డీలు పెరిగి పెరిగి ఏడాదికి కోటి రూపాయల వరకు వడ్డీనే కడుతున్నాడట. అందుకే చకచకా సినిమాలు చేయడానికి ఈయనగారు ముందుకు వస్తోన్నా.. ఛాన్స్ లు ఇచ్చేవారు కరువయ్యారు.