
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో విషాధ ఘటన జరిగింది. పురుగుల మందు డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హర్కాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ శ్రీదేవి (21) డిగ్రీ చదువుతున్నది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తన సోదరి మృతికి తన భార్య, అత్త వేధింపులే కారణమని మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.