https://oktelugu.com/

రమ్యకృష్ణకు రోజుకు అంత పారితోషికమా?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యక్రిష్ణ క్రేజ్ ఇన్నేళ్లు అయినా తగ్గడం లేదు. 90వ దశకంలో హీరోలతో రోమాంటిక్ గా ఆడిపాడిన ఈ సీనియర్ హీరోయిన్ ఆ తర్వాత ఏజ్ గడవడంతో కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే నరసింహ లాంటి రజినీకాంత్ సినిమాలో కత్తిలాంటి పాత్ర పోషించి దక్షిణాదిలోనే పాపులర్ అయ్యింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ‘బాహుబలి’లో శివగామిగా ఈమె చేసిన పాత్ర సినిమాకే ప్రాణం పోసింది. రమ్యకృష్ణ త్వరలో రాబోయే ‘లైగర్’తో పాటు ఆమె […]

Written By: , Updated On : June 6, 2021 / 10:50 AM IST
Follow us on

ramya krishna

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యక్రిష్ణ క్రేజ్ ఇన్నేళ్లు అయినా తగ్గడం లేదు. 90వ దశకంలో హీరోలతో రోమాంటిక్ గా ఆడిపాడిన ఈ సీనియర్ హీరోయిన్ ఆ తర్వాత ఏజ్ గడవడంతో కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే నరసింహ లాంటి రజినీకాంత్ సినిమాలో కత్తిలాంటి పాత్ర పోషించి దక్షిణాదిలోనే పాపులర్ అయ్యింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ‘బాహుబలి’లో శివగామిగా ఈమె చేసిన పాత్ర సినిమాకే ప్రాణం పోసింది. రమ్యకృష్ణ త్వరలో రాబోయే ‘లైగర్’తో పాటు ఆమె భర్త కృష్ణవంశీ తీసే ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తోంది.

ఇప్పటికీ దక్షిణాదిన ఎన్నో పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ సినిమాల ద్వారా రమ్యకృష్ణ చేరువ అవుతోంది. ఈమె నటన మాములుగా ఉండడం లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించే ఈమె దాదాపు రెండు దశబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ధృవతారగా వెలుగుతోంది. ఆమె తోటి నటులంతా ఇళ్లకే పరిమితం కాగా.. రమ్యకృష్ణ మాత్రం ఏదో ఒక పాత్రతో సినిమాల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా పాత్రకు తగ్గ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

50 ఏళ్లు దాటినా రమ్యక్రిష్ణ మాత్రం అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది. రమ్యకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉంది. ఈమె సినిమాల్లో నటించడానికి రోజుకు ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే ఆమె డిమాండ్ ఎంత ఉందో అర్థమవుతుంది.

రమ్యకృష్ణ పారితోషికం భారీగా పెంచేసిందని టాలీవుడ్లో ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రమ్యక్రిష్ణ రోజుకు రూ.10 లక్షలు తీసుకుంటుందట. అంటే పది రోజుల పాటు ఓ సినిమాకు పనిచేస్తే కోటి రూపాయలన్న మాట. స్టార్ హీరోయిన్లతో సమానంగా పారితోషికం తీసుకుంటున్న రమ్యకృష్ణ కు బాహుబలి తర్వాతే ఇంతటి క్రేజ్ వచ్చిందట.. ఆమె సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని టీవీ షోల్లో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తున్నారు.