‘చరణ్ – శంకర్’ సినిమా పై క్రేజీ అప్ డేట్ !

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే సాంగ్స్ ను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతాన్ని ఇస్తున్నాడు. సహజంగా శంకర్ సినిమాలకు నేపథ్య సంగీతం కూడా రహమానే ఇస్తుంటాడు. కానీ ఈ సారి మాత్రం అనిరుధ్ కి అవకాశం అవ్వడం నిజంగా విశేషమే. ఇక చరణ్ […]

Written By: admin, Updated On : April 3, 2021 9:56 am
Follow us on


మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే సాంగ్స్ ను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతాన్ని ఇస్తున్నాడు. సహజంగా శంకర్ సినిమాలకు నేపథ్య సంగీతం కూడా రహమానే ఇస్తుంటాడు. కానీ ఈ సారి మాత్రం అనిరుధ్ కి అవకాశం అవ్వడం నిజంగా విశేషమే.

ఇక చరణ్ – శంకర్ కాంబినేషన్ తొలిసారి కావడంతో ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో అందరిలోనూ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా బడ్జెట్ విషయంలో చాల జాగ్రత్తగా ఉండే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం అసలు బడ్జెట్ పై ఎలాంటి ఆంక్షలు లేకుండా సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఎలాగూ ఈ సినిమాకి పాన్ ఇండియా లెవల్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కి మార్కెట్ కూడా ఈజీగానే అవుతుంది.

అయితే శంకర్ లాక్ డౌన్ కి ముందు ‘ఇండియన్ -2’ స్టార్ట్ చేయడం, ఆ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి అనేక అడ్డంకులు ఎదుర్కోవడం మొత్తానికి ఈ సినిమాకు ఊహించని రీతిలో చిక్కులు ఎదురయ్యాయి. కానీ ‘ఇండియన్ -2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారితో శంకర్ కాంప్రమైజ్ అయ్యాడట. కమల్ హాసన్ నచ్చ చెప్పడంతో ‘ఇండియన్ -2’ని త్వరగా ఫినిష్ చేయడానికి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇక ‘2.0’ ఫ్లాప్ కావడంతో శంకర్ రెమ్యునరేషన్లో లైకా ప్రొడక్షన్ వారు కోత పెట్టారు. అందుకే శంకర్ హార్ట్ అయ్యారు. దాంతో సినిమా నుండే తప్పుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే లైకా నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు కూడా వెళ్లి వచ్చారు.