అమితాబ్ తో క్రేజీ బ్యూటీ.. తెగ ఫీల్ అయిందట !

క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసింది. చేతిలో సక్సెస్ లు ఉండేసరికి ఈ క్యూట్ బ్యూటీకి డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా రష్మికను తమ సినిమాలో పెట్టుకుంటే.. సౌత్ నుండి మార్కెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో రష్మిక తొలి బాలీవుడ్ మూవీకి ఇప్పటికే సైన్ చేయడం.. ఆ సినిమా షూట్ లో కూడా పాల్గొనడం తెలిసిందే. అయితే […]

Written By: admin, Updated On : April 3, 2021 9:52 am
Follow us on


క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసింది. చేతిలో సక్సెస్ లు ఉండేసరికి ఈ క్యూట్ బ్యూటీకి డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా రష్మికను తమ సినిమాలో పెట్టుకుంటే.. సౌత్ నుండి మార్కెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో రష్మిక తొలి బాలీవుడ్ మూవీకి ఇప్పటికే సైన్ చేయడం.. ఆ సినిమా షూట్ లో కూడా పాల్గొనడం తెలిసిందే.

అయితే తన మొదటి బాలీవుడ్ సినిమా సెట్ పై ఉండగానే, రెండో మూవీకి కూడా సైన్ చెయ్యడం, పైగా ఆ సినిమా కూడా స్టార్ట్ కావడంతో మొత్తానికి రష్మిక బాలీవుడ్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. ఇంతకీ రష్మిక రెండో బాలీవుడ్ మూవీ పేరు ఏంటో తెలుసా ‘గుడ్ బై’ అట. పై ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరో అట. మరి అమితాబ్ సినిమాలో రష్మిక ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తోందో చూడాలి.
కాగా ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక రష్మిక నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ పేరు ‘మిషన్ మజ్ను’. బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్దార్ట్ మల్హోత్రా నటిస్తోన్న ఈ మూవీ పై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా, రష్మికకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

ఇక రష్మిక ఇటు తమిళ్ లో కూడా నటిస్తోంది. ఆమెకు తమిళ ఇండస్ట్రీ నుండి కూడా వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. పైగా తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఆమె నటించిన ‘సుల్తాన్’ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఐతే సుల్తాన్ లో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అని రష్మిక తెగ ఫీల్ అయిందట. కూరలో కరివేపాకులాంటి రోల్స్ ఇక నుండి తానూ చేయను అను అమ్మడు చెబుతుందట.