ఆ హీరోల మాదిరిగా చరణ్ చేయగలడా?

శంకర్ దర్శకత్వం వహించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాను దర్శకత్వం వహించే సినిమాలలో హీరోలను ఎంతో విభిన్న రీతిలో చూపించడం ఒక శంకర్ కు మాత్రమే దక్కుతుంది. ఇప్పటివరకు శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలలో కమల్ హాసన్, రజిని, విక్రమ్ వంటి హీరోలతో చేసిన సినిమాలలో వారిని ఎంతో భిన్నంగా చూపించారు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయనున్నారు. శంకర్ ,రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో […]

Written By: Navya, Updated On : April 18, 2021 2:09 pm
Follow us on

శంకర్ దర్శకత్వం వహించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాను దర్శకత్వం వహించే సినిమాలలో హీరోలను ఎంతో విభిన్న రీతిలో చూపించడం ఒక శంకర్ కు మాత్రమే దక్కుతుంది. ఇప్పటివరకు శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలలో కమల్ హాసన్, రజిని, విక్రమ్ వంటి హీరోలతో చేసిన సినిమాలలో వారిని ఎంతో భిన్నంగా చూపించారు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయనున్నారు.

శంకర్ ,రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా మెగాస్టార్ చిరంజీవి నటిస్తారనే సమాచారం ఇదివరకు వినిపించింది. అయితే 50 సంవత్సరాలు వయస్సు ఉన్న ఆ పాత్రలో ఇతర హీరోల కంటే.. ఆ పాత్రను రామ్ చరణ్ తోనే చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన దర్శకుడికి తట్టింది. శంకర్ గతంలో కూడా తన సినిమాలలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు.

శంకర్ దర్శకత్వం వహించే సినిమాలలో హీరోలకు డిఫరెంట్ గెటప్స్, మేకప్స్ లో చూపించడానికి ఇష్టపడుతుంటారు.ఈ క్రమంలోనే శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా చరణ్ ను కూడా డ్యూయల్ రోల్ లో చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. అయితే కమల్ హాసన్, రజిని, విక్రమ్ లాంటి హీరోల మాదిరిగా రామ్ చరణ్ అందరిని మెప్పించగలడా అనే సందేహం కలుగుతుంది. ఈ విధంగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని తెలియడంతో మెగా అభిమానులలో ఈ గెటప్ పై ఎంతో ఆతృత ఏర్పడింది.