మహారాష్ట్రలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రత పెరుగుతోంది. సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో తీవ్రమవుతున్న కరోనా కేసులు బాలీవుడ్ ను తాకాయి. సెకండ్ వేవ్ లో బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కూ కరోనా సాగింది. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి స్వయంగా వెల్లడించారు.
‘బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ కు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ మధ్యకాలంలో అమీర్ ఖాన్ ను కలిసిన వారంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలి’’ అని అమీర్ ఖాన్ తరుఫున ఒక ప్రకటన విడుదలైంది.
తాజాగా ముంబైలో జరిగిన ఓ సినిమా ప్రివ్యూకు అమీర్ ఖాన్ హాజరయ్యారు. అప్పుడే ఆయనకు కరోనా సోకి ఉంటుందని అనుకుంటున్నారు.
56 ఏళ్ల అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవు. ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాలో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఆ సినిమా ఆగిపోయింది.