దేశంలో కరోనా సెకండ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా విద్యాసంస్థలను మూసేసింది. హాస్టళ్లు, పాఠశాలల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ నిర్ణయం ప్రకటిచింది. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టి సినిమా థియేటర్లపై పడింది.
Also Read: వకీల్ సాబ్ ట్రైలర్.. ఈ సాయంత్రమే క్రేజీ అప్డేట్!
వాస్తవంగా.. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అన్ని రంగాలూ వేగంగా గాడినపడ్డాయి. కానీ.. సినీరంగం సర్దుకోవడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరి నుంచే జనాలు థియేటర్లకు రావడం పెరిగింది. దీంతో. ఇప్పుడిప్పుడే ఈ రంగంపై ఆధారపడిన వారు కోలుకుంటున్నారు. అలాంటిది.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం.. లాక్ డౌన్ రూమర్స్ సర్క్యులేట్ అవుతుండడంతో నిర్మాతల్లో భయం మొదలైంది.
సమ్మర్ టార్గెట్ గా పెద్ద చిత్రాలన్నీ స్లాట్ బుక్ చేసుకొని సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ తో బడా సినిమాలు క్యూ కట్టనున్నాయి. చిరంజీవి ఆచార్య, బాలయ్య బీబీ-3, వెంకీ నారప్ప వంటి చిత్రాలు సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కానీ.. పరిస్థితి చూస్తుంటే కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది సినీ మేకర్స్ లో.
Also Read: నాగబాబు మరీ అంత క్రూరుడా.. ఈ ఫొటోనే సాక్ష్యం!
థియేటర్లను పూర్తిస్థాయిలో మూసేయకపోయినా.. మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లోకి వస్తుందేమో అనే భయం నిర్మాతల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే.. పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు. నిజానికి 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలను రిలీజ్ చేసే కండీషన్లో పెద్ద నిర్మాతలు ఎవరూ లేరని చెప్పొచ్చు.
ఒకవేళ నిజంగానే.. సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, అది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఆ సినిమాపై ఖర్చు చేసిన కోట్ల రూపాయలు, వాటికి వడ్డీలు కలిపి తడిసి మోపెడయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే.. ఈ సెకండ్ వేవ్ ఏం చేస్తుందోనని హడలిపోతున్నారు నిర్మాతలు. ఈ కారణం వల్ల.. కొత్త సినిమాలు మొదలు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారని చెబుతున్నాఆరు ట్రేడ్ పండితులు. మరి, ఏం జరుగుతుంది? సినిమా ఇండస్ట్రీపై సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉండబోతోంది? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్