వైఎస్సార్ జయంతికి జగన్ సర్ ప్రైజ్…?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రేసింగులకు ముందు ప్లాగ్ చేసే సన్నివేశాలు చాలా ఇష్టం అనుకుంటా.. ఆయన వందలాది వాహనాలకు అలా జెండా ఊపి ప్రారంభించడానికి తెగ ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఓసారి 108 వాహనాలు.. మరోసారి రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు అలాగే జెండా ఊపిన ఆయన ఈ సారి చెత్తను తరలించే వాహనాలకు జెండా ఊపాలని నిర్ణయించారు. Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.1000తో లక్షలు పొందే […]

Written By: Srinivas, Updated On : March 24, 2021 4:24 pm
Follow us on


ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రేసింగులకు ముందు ప్లాగ్ చేసే సన్నివేశాలు చాలా ఇష్టం అనుకుంటా.. ఆయన వందలాది వాహనాలకు అలా జెండా ఊపి ప్రారంభించడానికి తెగ ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఓసారి 108 వాహనాలు.. మరోసారి రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు అలాగే జెండా ఊపిన ఆయన ఈ సారి చెత్తను తరలించే వాహనాలకు జెండా ఊపాలని నిర్ణయించారు.

Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.1000తో లక్షలు పొందే ఛాన్స్..?

మొత్తంగా ఎనిమిది వేల వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వార్డుకు రెండు చొప్పున కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. జూలై ఎనిమిదో తేదీలోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. వాహనాలు అప్పటి వరకు రెడీ అయితే.. ఆరోజు బెంజ్ సర్కిల్ లో వాహనాల పరేడ్ పెట్టి వాటికి జెండా ఊపి సీఎం జగన్ ప్రారంభిస్తారు. జూలై ఎనిమిదో తేదీనే ఎందుకంటే.. ఆరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని వాహనాలు కొనుగోలు చేశారు. మిగితా వాటికి రంగులు వేశారు. అలా మొత్తంగా అన్నీ కొత్తవే ప్రారంభిస్తున్నట్లుగా అన్నింటికి కలిపి బెంజ్ సర్కిల్ లో జెండా ఊపారు. తరువాత రేషన్ డోర్ డెలివరీ వాహనాల వంతు. దాదాపు తొమ్మిదివేల వాహనాలు కోనుగోలు చేశారు. ఒక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు రూ.20వేలకన్నా ఎక్కువే ఖర్చు పెడుతోంది. ఆ వాహనాలను గుజరాత్ లో తయారు చేయించింది. ఇప్పుడు చెత్తకోసం మరో ఎనిమిది వేల వాహనాలు కొనగోలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.

Also Read: జనంలోకి జగన్.. వారు అప్రమత్తం..

నిజానికి గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను నెలకొలిపేందుకు చెత్త సేకరణకోసం గత సార్వత్రిక ఎన్నికల ముందు మండలానికి 15 ఆటోలు మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులను గుర్తించి ఆటోలను అందించాల్సి ఉంది. కానీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో అవి నిరుపయోగంగా ఉంటుంన్నాయ. తుప్పు పట్టిపోతున్నాయి. ఇప్పుడు ఆ వాహనాలకు మళ్లీ రంగులు వేస్తారా..? లేకుంటే కొత్తవి కొనుగోలు చేస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్