https://oktelugu.com/

పెద్ద సినిమాల కష్టం వృధా.. సమ్మరూ వ్యధే !

ఈ కరోనా కాలంలో ప్రపంచంలో బాగా నలిగిపోయింది ఏదైనా ఉంది అంటే.. అది ‘సినిమా’నే. సినిమా పుట్టిన అప్పటి నుండి ఇప్పటి వరకూ కరోనా ఇబ్బంది పెట్టినట్టు వరదలు, వ్యాధులు ఏది ఇంతలా సినీ లోకాన్ని కన్నీళ్ల మయం చేయలేదు. 2020 మొత్తం కరోనాతో కరిగిపోయింది. ఈ ఏడాది అతి ముఖ్యం అనుకున్న సమ్మర్ సీజన్ కూడా గాయబ్ అయిపోయేలా ఉంది. 2021 సంక్రాంతి అనుమానంగా మొదలై సినిమాలకు పర్వాలేదు అనిపించుకుంది. దాంతో సినిమా ఇండస్ట్రీలు అన్ని […]

Written By:
  • admin
  • , Updated On : April 26, 2021 / 09:15 AM IST
    Follow us on


    ఈ కరోనా కాలంలో ప్రపంచంలో బాగా నలిగిపోయింది ఏదైనా ఉంది అంటే.. అది ‘సినిమా’నే. సినిమా పుట్టిన అప్పటి నుండి ఇప్పటి వరకూ కరోనా ఇబ్బంది పెట్టినట్టు వరదలు, వ్యాధులు ఏది ఇంతలా సినీ లోకాన్ని కన్నీళ్ల మయం చేయలేదు. 2020 మొత్తం కరోనాతో కరిగిపోయింది. ఈ ఏడాది అతి ముఖ్యం అనుకున్న సమ్మర్ సీజన్ కూడా గాయబ్ అయిపోయేలా ఉంది. 2021 సంక్రాంతి అనుమానంగా మొదలై సినిమాలకు పర్వాలేదు అనిపించుకుంది.

    దాంతో సినిమా ఇండస్ట్రీలు అన్ని 2021 సమ్మర్ ను గొప్పగా ప్లాన్ చేసుకున్నాయి. ప్రతి వారం ఓ భారీ సినిమాని ప్లాన్ చేశారు. రెండు నెలల క్రితం పరిస్థితి బాగానే ఉంది. థియేటర్లు కూడా సమ్మర్ కి పూర్తిగా సెట్ అవుతాయి అనే నమ్మకం కలిగింది. అందుకే, నిర్మాణంలో వున్న పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కు రెడీ అవ్వాలనే ఉద్దేశ్యంతో చాల స్పీడ్ గా షూటింగ్ లు జరువుకున్నాయి. నిజానికి భారీ సినిమా పూర్తి కావాలంటే ఆరేడు నెలలు కనీసం పడుతుంది.

    అయితే ప్రతి భారీ సినిమాకి రిలీజే ముఖ్యం కాబట్టి.. సమ్మర్ కి ఎలాగైనా రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి, హీరోలు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ కోసం తెగ కష్టపడ్డారు. కొరటాల శివ-మెగాస్టార్ ఆచార్య సంగతే తీసుకుందాం. ఒక్క రోజు కూడా చిరు షూట్ కి గ్యాప్ ఇవ్వకుండా మెగాస్టార్ ఈ సినిమా కోసం పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని సమ్మర్ కి గట్టిగా ప్లాన్ చేశారు. సినిమా కూడా చివరి దశలో ఉంది.

    కానీ ఏం లాభం ? కరోనా సెకెండ్ వేవ్ తో మెగా కష్టం అంతా వృధా అయిపోయింది. అలాగే బోయపాటి-బాలయ్య సినిమాను కూడా భారీ సమ్మర్ సినిమాగా తీసుకోవడానికి బాలయ్య బృందం తెగ ఆరాట పడింది. అదే విధంగా మహేష్ సర్కారువారి పాట కూడా, ఇలాగే ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, కెజిఎఫ్ 2, తలైవి, ఇలా భారీ సినిమాల అన్ని సమ్మర్ రిలీజ్ కోసం తెగ కష్టపడ్డాయి. కానీ మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి, పైగా అతిముఖ్యమైన సమ్మర్ కూడా మైనస్ అయ్యేలా ఉంది.