https://oktelugu.com/

బన్నీ బర్త్ డే స్పెషల్.. అదేనా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ‘పుష్ప’ సినిమా నుండి ఒక క్రేజీ అప్ డేట్ రానుంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే ఉండడంతో.. మొత్తానికి ఆ రోజున ఓ మాస్ అప్డేట్ ఉండనుంది. ఐతే ఈ అప్ డేట్ ఏంటి అనేది మరి కాసేపట్లో అంటే ఈ ఉదయం 11 గంటలకు రివీల్ కానుంది. ఇక బన్నీ అభిమానులు ఈ అప్ డేట్ కోసం ఎంతో […]

Written By: , Updated On : April 3, 2021 / 09:44 AM IST
Follow us on

Pushpa Movie
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ‘పుష్ప’ సినిమా నుండి ఒక క్రేజీ అప్ డేట్ రానుంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే ఉండడంతో.. మొత్తానికి ఆ రోజున ఓ మాస్ అప్డేట్ ఉండనుంది. ఐతే ఈ అప్ డేట్ ఏంటి అనేది మరి కాసేపట్లో అంటే ఈ ఉదయం 11 గంటలకు రివీల్ కానుంది.

ఇక బన్నీ అభిమానులు ఈ అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా నుండి బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక వైవిధ్యమైన కథతో రానున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అయినా బన్నీ – సుక్కు కలయిక అంటేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది ఫుల్ మాస్ సినిమా అంటే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అడ్డు ఏముంటుంది.

అన్నట్టు ఈ సినిమా కోసం బన్నీ బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తన లుక్ ను మార్చిన బన్నీ.. ఇంటర్వెల్ లో వచ్చే తోడేలు ఫైట్ కోసం అచ్చం తోడేలులా ఎలా పరిగెత్తాలో ఎలా దాడి చేయాలో కూడా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. కాగా భారీ బడ్జెట్ కేటాయించి మరీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సెన్సేషన్ హీరోయిన్ రష్మీక కథానాయకిగా నటిస్తోంది.

ఎలాగూ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ నుండి వస్తోన్న సినిమా కావడంతో.. రెండేళ్లపాటు ప్లాన్ చేసి మరీ బన్నీ ఈ సినిమాకి కమిటయ్యాడు. అలాగే ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె పై ఇప్పటికే సాంగ్ కూడా షూట్ చేశారు. సాంగ్ లో ఆమె డ్యాన్స్ ఆదరిపోనుందని తెలుస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.