హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ముపై ఏళ్ళు దాటాయి. పెళ్లి ఈడు వచ్చింది. అందుకే ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత సుభాష్ లా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చే ఆలోచనలో కూడా లావణ్య ఉందని, ఇప్పటికే ఈ క్యూట్ బ్యూటీకి నిశ్చితార్థం కూడా అయిపోయిందని తెలుస్తోంది.
త్వరలోనే లావణ్య పెళ్లి పీటలు ఎక్కబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి, ఈ పుకార్లల్లో ఎంత వాస్తవం ఉంది అనే విషయానికి వస్తే… లావణ్య ఫ్యామిలీ ఎప్పటినుండో లావణ్యకి వివాహం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి ఎంగేజ్ మెంట్ కూడా అయిందని, త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని తెలుస్తోంది.
మరి ఈ పెళ్లి వార్తల పై లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తోందో చూడాలి. అయితే, తన తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకువచ్చినా ఇన్నాళ్లు పెళ్లి పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చిన లావణ్య, ఈ సారి మాత్రం తానే పెళ్ళికి తొందర పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో మూడు సినిమాలున్నాయి. ఈ మూడు సినిమాల పై చాలా ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ.