నిర్మాత దిల్ రాజు బ్యానర్ వైభవం తగ్గుతున్న టైమ్ లో రిలీజ్ అయి, రాజు క్రేజ్ ను నిలబెట్టింది ‘ఎఫ్ 2’ సినిమా. ఇంకా కరెక్ట్ గా కమర్షియల్ లెక్కలతో సహా క్లారిటీగా చెప్పుకుంటే.. దిల్ రాజు బ్యానర్ లో భారీ లాభాలు తెచ్చిన సినిమాగా కూడా ‘ఎఫ్ 2’ సినిమా రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఫిదా తరువాత దిల్ రాజుకి దాదాపు ఆరు సినిమాల్లో నష్టాలు వచ్చాయి.
ఓ దశలో ఇక దిల్ రాజు పని అయిపోయింది అనుకుంటున్న టైంలో ‘ఎఫ్ 2’ సినిమా వల్ల రాజుకు వచ్చిన డబ్బులు ఇన్నీ అన్నీ కావు. అందుకే అనిల్ రావిపూడిని కూర్చోపెట్టి ‘ఎఫ్ 3’ సినిమా కథను రాయించి, హీరోల డేట్లును కూడా బలవంతంగా తెప్పించుకుని మరీ మొత్తానికి ‘ఎఫ్ 3’ సినిమాని గ్రాండ్ గా ప్రకటించాడు.
దాంతో అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ ను స్పీడ్ గా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతలో కరోనా వచ్చి షూటింగ్ కు బ్రేక్ వేసేసింది. కానీ వచ్చే నెలలో అన్ని సినిమాల షూటింగ్ లు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. కానీ ‘ఎఫ్ 3’ మాత్రం స్టార్ట్ అవ్వడం కుదిరేలా లేదు. పోస్ట్ కరోనా సెకెండ్ వేవ్ తరువాత విక్టరీ వెంకటేష్ ముందుగా ‘నారప్ప’ సినిమా కోసం రెండు నెలలు టైమ్ ను కేటాయించనున్నాడు.
కాబట్టి వెంకీ ఎఫ్ 3 కి ఇప్పట్లో డేట్స్ ఇవ్వడం సాధ్యమయేలా కనిపించడం లేదు. అలాగే వరుణ్ తేజ్ కూడా తన బాక్సర్ సినిమా పూర్తి చేసిన తరువాతే ఎఫ్ 3 కోసం డేట్స్ ఇస్తాడట. అంటే జూలైలో సినిమాల షూటింగ్స్ స్టార్ట్ అయినా, ఎఫ్ 3 సినిమా మాత్రం ఇప్పట్లో స్టార్ట్ కాదు. మరి వచ్చే సంక్రాంతికి ఎఫ్ 3 పూర్తి అవుతుందా అంటే అనుమానమే. దాంతో దిల్ రాజు సంక్రాంతి టార్గెట్ మిస్ అయినట్టే.