హైబీపీ కారణంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని హైబీపీ మాత్రమే ఉందన్నారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బ్రుందం పర్యవేక్షిస్తుందని బీపీలో హెచ్చు తగ్గుదలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తమన్నారు. గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్ లో ఉంటున్నారు.
రెండు రోజుల కిందట చిత్రం యూనిట్ లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో రజనీ టెస్టు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే హైబీపీ రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Rajinikanth health bulletin released from appolo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com