కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు తీపికబురు అందించింది. టోల్ గేట్ చార్జీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం టోల్ గేట్ల వద్ద క్యూ లైన్లు ఎక్కువ పొడవు లేకుండా ఉండటానికి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఇకపై టోల్ ప్లాజాల దగ్గర వాహనాల లైన్ 100 మీటర్ల కన్నా ఎక్కువగా ఉండదు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాల వద్ద వెయింటింగ్ టైమ్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వెహికల్‌కు 10 సెకన్ల కన్నా ఎక్కువ టైమ్ పట్టదు. కొత్త నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కంటే ఎక్కువగా లైన్ ఉంటే 100 మీటర్ల లోపునకు వచ్చే వరకు ముందు వెహికల్స్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు.
కేంద్రం అమలులోకి తీసుకురాబోయే ఈ నిబంధనల వల్ల వాహనాదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. కేంద్రం వాహనదారుల కోసం ఇప్పటికే ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ వల్ల వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండానే వెళ్లిపోయే అవకాశం అయితే ఉంటుంది. టోల్ చార్జీలు ఫాస్టాగ్ నుంచి కట్ కాగా డబ్బులు అయిపోతే వాహనదారులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మోదీ సర్కార్ వాహనదారులకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. పండుగల సమయంలో, ఇతర ప్రత్యేక దినాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టోల్ ప్లాజాల దగ్గరా వాహనాల లైన్ ఎక్కువ పొడవు ఉండే అవకాశం ఉండదు.