
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులకు కేంద్రం దృష్టిలో పెట్టుకుని వేర్వేరు పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో చేరడం ద్వారా ప్రభుత్వం అందించే పథకాల యొక్క ప్రయోజనాలను సులభంగా పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
నిర్మాణ కార్మికులతో పాటు, వీధి వ్యాపారులు, రిక్షా తొక్కే వాళ్లు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారు ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి ఏకంగా మొత్తం 36,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా డబ్బులను పొందాలంటే ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ స్కీమ్ కోసం డబ్బులు చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సులో ఉన్నవాళ్లు నెలకు 55 రూపాయలు చెల్లిస్తే 3,000 రూపాయలు పొందే అవకాశం ఉండగా 40 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందడానికి అర్హులుగా ఉంటారు. ఈ స్కీమ్ లో చేరాని అనుకునే వాళ్లు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లడం ద్వారా ఈ స్కీమ్ లో చేరవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా సులభంగా ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తరువాత డబ్బులు ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యేలా ఆటో డెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.