జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ విషయంలో జియోనే టాప్..?

దేశీయ టెలీకాం దిగ్గజం జియో ఎంట్రీతో దేశంలో ఇంటర్ నెట్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించే నెట్వర్క్ గా జియో పేరును సంపాదించుకుంది. జియో ఎంట్రీ వల్ల పలు టెలీకాం సంస్థలు మూతబడగా మరికొన్ని టెలీకాం సంస్థలకు భారీగా నష్టాలు వచ్చాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకున్న జియో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్లకు సవరణలు చేయడం గమనార్హం. […]

Written By: Navya, Updated On : July 10, 2021 1:05 pm
Follow us on

దేశీయ టెలీకాం దిగ్గజం జియో ఎంట్రీతో దేశంలో ఇంటర్ నెట్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించే నెట్వర్క్ గా జియో పేరును సంపాదించుకుంది. జియో ఎంట్రీ వల్ల పలు టెలీకాం సంస్థలు మూతబడగా మరికొన్ని టెలీకాం సంస్థలకు భారీగా నష్టాలు వచ్చాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకున్న జియో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్లకు సవరణలు చేయడం గమనార్హం.

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో డేటా వాడకం భారీగా పెరగగా జియో ఎంట్రీతో డేటా వాడకం ఊహించని స్థాయిలో మరింతగా పెరగడం గమనార్హం. తాజాగా ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో జియో మరోమారు ఫస్ట్ ప్లేస్ లో నిలవడం గమనార్హం. 4జీ సెగ్మెంట్ విషయానికి వస్తే జియో ఏకంగా 21.9 మెగాబిట్‌ పర్‌ సెకండ్‌ సగటు స్పీడ్ తో టాప్ లో నిలిచింది. వొడాఫోన్ ఐడియా అప్ లోడ్ విషయంలో 6.2 ఎంబీబీపీఎస్‌ స్పీడ్‌తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ విషయానికి వస్తే వొడాఫోన్ ఐడియా 6.5 ఎంబీపీఎస్‌ సగటు వేగం అందిస్తోంది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో వేగం మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మైస్పీడ్‌ అప్లికేషన్‌ సాయంతో ట్రాయ్ ప్రతి నెలా ఈ వివరాలను వెల్లడిస్తోంది. మరోవైపు జియో ఏడాది కాలపరిమితితో రూ.3,499 ప్లాన్ ను తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3జీబీ డేటాను పొందే అవకాశం ఉంటుంది.