Yezdi Wolf Edition: ప్రముఖ బైక్ కంపెనీ Yezdi కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇటీవల ఇది Wolf ఎడిషన్ రిలీజ్ చేయడంతో దీని గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డెకాల్స్, క్రోమ్ యాక్సెంట్, డీప్ రెడ్ పెయింట్ స్కీమ్స్ ఉన్నాయి. దీని డిజైన్‌తో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి అనుగుణంగా ఉండేందుకు తీర్చిదిద్దారు. ఈ కొత్త ఎడిషన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతదేశంలో Yezdi కంపెనీ బైక్స్ వినియోగదారులకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త డిజైన్ తో మార్కెట్లోకి వస్తుంటాయి. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన జావా 42, జావా పెరాక్, Yezdi రోడ్ స్టర్, Yezdi అడ్వెంచర్ వంటివి అలరించాయి. వీటిలో అడ్వెంచర్, BSA గోల్డ్ స్టార్ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా Wolf ఎడిషన్ ను ప్రవేశపెట్టింది. ఈ బైక్ ఎవరు ఊహించని విధంగా కొత్త కలర్‌తో మార్కెట్లోకి రాబోతుంది. అలాగే ఇది బోల్డ్, ప్రీమియం వలె అనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెడ్ కలర్ లలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ తో పాటు టూల్ బాక్స్ వరకు ఫెండర్ పై గోధుమ రంగును వేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ బైక్ క్లాసిక్ డిజైన్ తో ప్రీమియం లుక్ ను అందిస్తుంది.
ఇందులో LED హెడ్ లాంప్, అల్లాయి వీల్స్, సస్పెన్షన్ సెటప్, టైర్లతో పాటు స్పీడోమీటర్ సహా అన్ని ప్రత్యేకంగా కనిపించేలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంజన్ విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదని తెలుస్తుంది. ఈ బైక్ లో 334CC ఆల్ఫా 2 లిక్విడ్ coold ఇంజన్ సెట్ చేశారు. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. అలాగే ఈ బైక్ 29.1 పిఎస్ పవర్ తో పాటు 29.63 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే ఈ బైక్ లో సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్ సెటప్ అమర్చారు. రౌండ్ డిజిటల్ స్పీడోమీటర్ Yezdi మొబైల్ యాప్ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి వినియోగదారులకు సపోర్ట్ గా ఉంటాయి.
దీనిని మార్కెట్లో రూ.1.96 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించారు. దీంతో ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, హోండా హైనేస్ CB 350, ట్రయంప్ స్పీడు T4 వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.