Yamaha FZ-S Fi : ప్రస్తుతం ఆటో మొబైల్ ప్రపంచంలో హైబ్రిడ్ మోటార్ సైకిల్స్ సంచలనాలు సృష్టిస్తున్నాయి. అసలు హైబ్రిడ్ బైక్ అంటే ఏంటి..యమహా ఇటీవల భారతదేశంలో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన మొట్టమొదటి 150cc బైక్ – FZ-S Fiను ప్రవేశ పెట్టింది. దాని ఫీచర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా కొత్త మోడల్ లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది ప్యూయల్ ఎఫీషియన్సీ, పర్యావరణ అనుకూలంగా చేస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో 4.2-అంగుళాల TFT డిస్ప్లే, OBD2B-కంప్లైంట్ ఇంజిన్‌తో సహా అనేక కొత్త ఫీచర్లలతో మార్కెట్లో సంచలనం సృష్టించనుంది.
Also Read : త్వరలో మార్కెట్లోకి బీఎండబ్ల్యూ రూ.11లక్షల స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
హైబ్రిడ్ మోటార్ సైకిల్ అంటే ఏమిటి?
హైబ్రిడ్ మోటార్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు రెండింటినీ ఉపయోగిస్తుంది. ఈ కలయిక ఫ్యూయల్ కెపాసిటీని మెరుగుపరచడంతో కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అవి హైబ్రిడ్ కార్ల మాదిరిగానే పనిచేస్తాయి. తక్కువ వేగంతో, ఎలక్ట్రిక్ మోటారు బైక్‌కు పవర్ ఇస్తుంది.బైక్ కు ఎక్కువ పవర్, యాక్సలరేషన్ అవసరం అయినప్పుడు పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్ చేస్తుంది.
హైబ్రిడ్ మోటార్ సైకిల్: లాభాలు
ఖర్చు ఆదా: హైబ్రిడ్ బైక్‌లు సాంప్రదాయ బైక్‌ల కంటే ఎక్కువ ఫ్యూయల్ కెసాసిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫ్యూయల్ కోసం తక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ మోటారును ఛార్జ్ ఆఫ్షన్ సాయంతో ఫ్యూయల్ వినియోగాన్ని మరింత తగ్గించుకోవచ్చు.
పర్యావరణ అనుకూలం : ఈ బైక్‌లు సాధారణ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి పర్యావరణానికి మంచిది. పవర్ కు మారడం ద్వారా పర్యావరణం పై ప్రభావాన్ని తగ్గిస్తారు.
స్మూత్ రైడ్: ఎలక్ట్రిక్ మోటారు, గ్యాస్ ఇంజిన్ మధ్య స్మూత్ గా ట్రాన్సిమిషన్ అవుతుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణాల సమయంలో మరింత సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తుంది.
హైబ్రిడ్ మోటార్ సైకిల్: నష్టాలు
అధిక ప్రారంభ ఖర్చు: హైబ్రిడ్ మోటార్‌సైకిళ్ల వెనుక ఉన్న టెక్నాలజీ సాంప్రదాయ బైక్‌లతో పోలిస్తే కాస్త ఖరీదైనది.. మీరు దాని కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
లిమిటెడ్ బ్యాటరీ లైఫ్: హైబ్రిడ్ మోటార్‌సైకిళ్లు రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటే ఛార్జింగ్ స్టేషన్‌లు ఎల్లప్పుడూ సమీపంలో ఉండకపోవచ్చు కాబట్టి ఇది సమస్య కావచ్చు.
పర్ఫామెన్స్ : హైబ్రిడ్ మోటార్‌సైకిళ్లు పవర్, పర్యావరణ అనుకూలత సమతుల్యతను అందించింనా.. అవి స్పీడ్, పవర్ పరంగా సాంప్రదాయ గ్యాస్ బైక్‌ల పర్ఫామెన్స్ లతో సరిపోవు.అదనపు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ కారణంగా అవి బరువుగా ఉంటాయి.
హై మెయింటెనెన్స్ : హైబ్రిడ్ బైక్‌లకు మెయింటెన్స్ ఖరీదైనది. టైం పడుతుంది. ఆయిల్ ఛేంజ్ లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ రెండింటినీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఇది దాని ఓనర్ కు ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుంది.
హైబ్రిడ్ మోటార్‌సైకిల్ భవిష్యత్తు:
హైబ్రిడ్ మోటార్‌సైకిళ్లు రవాణా రంగంలో కీలక మార్పును తీసుకు రాబోతున్నాయి. పవర్ ఫుల్ బ్యాటరీలు రావడం, మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు అయినప్పుడు మాత్రమే వీటికి భవిష్యత్ ఎక్కువగా ఉంటుంది. కవాసకి వంటి తయారీదారులు మరింత అధునాతన హైబ్రిడ్ టెక్నాలజీతో ప్రోటోటైప్‌లపై పని చేస్తున్నాయి.
Also Read : టీవీఎస్ కంపెనీ నుంచి లగ్జరీ ఫీచర్స్ బైక్.. లో బడ్జెట్లో అందుబాటులోకి.. వెంటనే తెలుసుకోండి..