Stranger Things 5 : సైన్స్ ఫిక్షన్ చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే హాలీవుడ్ సినిమాల్లో ఆ గ్రాఫిక్స్ మాయాజాలం వీక్షకులను కుర్చీలకు పరిమితం చేస్తాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల కోసం వస్తున్నాయి. అలాంటి ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతుంది. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 1 2016లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. దీనికి విదేశాలతో పాటు భారతీయ ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది. దీని తర్వాత ఈ సిరీస్ మరో రెండు సీజన్లు 2017, 2019లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. స్ట్రేంజర్ థింగ్స్ కథ నెక్ట్స్ సీజన్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
Also Read : యాక్షన్ మూవీస్ కొంప ముంచిన ‘మార్కో’.. ఇక నుండి సెన్సార్ బోర్డ్ కఠినమైన రూల్స్ అమలు చేయనుందా?
స్ట్రేంజర్ థింగ్స్ దాని కథలు, ప్రత్యేక పాత్రలు, నాస్టాల్జిక్ టోన్, హర్రర్, మిస్టరీ ప్రేక్షకులను థ్రిల్లింగుకు గురి చేస్తుంటాయి. 2022లో నాల్గవ సీజన్ భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడు మేకర్స్ సైన్స్ ఫిక్షన్ ఐదవ, చివరి సీజన్ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చారు. ఈ సిరీస్‌ను భారతీయ ప్రేక్షకులు ఎప్పుడు చూడగలుగుతారో డఫర్ బ్రదర్స్ వెల్లడించారు.డఫర్ బ్రదర్స్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ను అధికారికంగా ధృవీకరించారు. ఇది హర్రర్, సైన్స్ ఫిక్షన్ సిరీస్ చివరి సీజన్ అని..దీనితో హాకిన్స్ కథ ముగుస్తుందని వారు తెలిపారు. స్ట్రేంజర్ థింగ్స్ అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని వారు చెప్పుకొచ్చారు. గతేడాది ఈ సీజన్ షూటింగ్ పూర్తయింది.ఇప్పుడు అధికారికంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
View this post on Instagram
‘ది స్ట్రేంజర్ థింగ్స్ 5’ లో స్పెషాలిటీ ?
డఫర్ బ్రదర్స్ గత సీజన్ ఉత్కంఠభరితంగా ఉంది. సీజన్ 5 దానిని మించి ఉంటుందని డఫర్ బ్రదర్స్ తెలిపారు. అప్‌సైడ్ డౌన్ చరిత్రను, హాకిన్స్‌తో దాని సంబంధాలను ఈ సీజన్లో వివరించనున్నారు. ప్రేక్షకులు కొన్నేళ్లుగా ఇష్టపడే పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కొత్త సీజన్ 1987 లో ప్రారంభమవుతుంది. అభిమానులు కొత్త పాత్రలను చూస్తారు. వారిలో నెల్ ఫిషర్, జేక్ కాన్నెల్లీ, అలెక్స్ బ్రూక్స్ ఉన్నారు. ది టెర్మినేటర్‌తో పాపులర్ అయిన లిండా హామిల్టన్ కూడా ఇందులో నటించారు.