Population: దేశంలో 2026లో నియోజకవర్గాల పునర్విభజన(Constitutions Reorganizetion)జరుగనుంది. ఈమేరకు కేంద్రం ఈ ఏడాది చివరి నుంచే కసరత్తు మొదలు పెట్టనుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచే ఈ ప్రక్రియ జనాభా ప్రాతిపదికనే జరుగుతోంది. 2026లో కూడా అదే విధంగా జరుగుతందని దక్షిణ భారత దేశ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని నేతలు అంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల(Reganal Parties)నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గుతుంది అనేది వారి ఆందోళన. దీంతో రాజకీయ నేతలకు అవకాశాలు తగ్గుతాయి. ఈ విషయం చెప్పకుండా దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై వివక్ష కొనసాగుతుందని, నిధులు తగ్గుతాయని, సమస్యలను చెప్పేవారి బలం తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు.
రాజకీయ కొనమా?
భారతదేశంలో ఓటు బ్యాంక్(Vote Bank)రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. జనాభా పెరిగితే, కొన్ని సమాజ వర్గాలు లేదా మత సమూహాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే, ఆ వర్గాల మద్దతును ఆకర్షించడం ద్వారా రాజకీయ పార్టీలు తమ పట్టును బలోపేతం చేసుకోవచ్చని భావిస్తాయి.
సంతానోత్సత్తి ఇలా..
భారతదేశంలో సంతానోత్పత్తి రేటు (TFR)) 2021 NFHS –5 సర్వే ప్రకారం 2.0కి పడిపోయింది, ఇది రీప్లేస్‌మెంట్ లెవల్ (2.1) కంటే తక్కువ. కొన్ని రాష్ట్రాల్లో (ఉదా., కేరళ, తమిళనాడు) ఇది 1.6 కంటే తక్కువగా ఉంది. దీర్ఘకాలంలో యువత సంఖ్య తగ్గితే, ఆర్థిక వృద్ధి, శ్రామిక శక్తి ప్రభావితమవుతుందని వారు భావిస్తారు. కానీ ఈ వాదనను రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
జనాభా పెరిగితే ప్రమాదాలు ఏమిటి?
జనాభా అనియంత్రితంగా పెరిగితే అనేక సమస్యలు తలెత్తుతాయి:
వనరుల కొరత: భారతదేశంలో ఇప్పటికే నీరు, ఆహారం, మరియు భూమి వంటి సహజ వనరులపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. జనాభా పెరిగితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఆర్థిక భారం: ఎక్కువ మంది పిల్లలు అంటే విద్య, ఆరోగ్యం, మరియు ఉపాధి కోసం ప్రభుత్వంపై ఖర్చు పెరుగుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.
పర్యావరణ ప్రభావం: అటవీ నిర్మూలనం, కాలుష్యం, మరియు వాతావరణ మార్పులు జనాభా పెరుగుదలతో మరింత ఉధతమవుతాయి. ఇప్పటికే భారతదేశం ఈ సమస్యలతో సతమతమవుతోంది.
సామాజిక అసమానతలు: వనరులు పరిమితంగా ఉంటే, ధనిక–పేద వర్గాల మధ్య అంతరం పెరిగి, సామాజిక అశాంతి పెరుగుతుంది.
ఉపాధి సమస్య: ఇప్పటికే నిరుద్యోగం ఒక పెద్ద సవాలుగా ఉంది. జనాభా పెరిగితే ఉద్యోగ అవకాశాలు సరిపడక, యువత నిరాశకు గురవుతుంది.
భారతదేశం జనాభా పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఉంది (2023లో 142 కోట్లు దాటింది), ఈ పరిస్థితిలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం ప్రమాదకరం కావచ్చు. బదులుగా, విద్య, మహిళల సాధికారత, స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.