Xiaomi Pad 8 Launch 2026: 2026 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా కొన్ని కంపెనీలు కొత్త కొత్త మొబైల్స్ ను ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా Xiaomi కంపెనీ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో అద్భుతమైన బ్యాటరీ తో పాటు అప్గ్రేట్ అయిన సాఫ్ట్వేర్ను ఉంచింది.. అలాగే నాణ్యమైన కెమెరా కూడా ఉండడంతో చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. మార్చి 10న అందుబాటులోకి వచ్చిన ఇందులో ఉండే ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read: ట్రంప్ సీరియస్ యుద్ధంలో సీపీఐ నారాయణ కామెడీ
Xiaomi కంపెనీ Pad 8 అనే మొబైల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో డిస్ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. 11.2 అంగుళాల డిస్ప్లే ఉండడంతో పాటు ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే 8gb రామ్ నుంచి ప్రారంభమవుతుంది. 256 జీవి వరకు స్టోరేజ్ అందించనుంది. ఈ మొబైల్ AI క్రియేషన్స్ టూల్స్, సబ్ టైటిల్ వంటి అనేక ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
Xiaomi Pad 8 మొబైల్ లో కెమెరా ప్రత్యేకంగా ఉండనుంది.13 MP మెయిన్ కెమెరా ఉండగా..2.2 ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం మద్దతు ఇస్తుంది. అలాగే ఈ కెమెరాతో 4కె వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు.30 fps వద్ద 1080 వీడియోను రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం టాబ్లెట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ కంపెనీ కొత్తగా ఈ మొబైల్ లో ప్రవేశపెట్టింది. ఇందులో బ్యాటరీ మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.9,200 mAh బ్యాటరీ ఉండగా దీనికి 45 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. వీటితోపాటు నేటితరం వారికి అనుగుణంగా ఉండేలా అనేక ఫీచర్లను అమర్చారు. యూఎస్బీ టైప్ సి, వైఫై సిక్స్ e, వైఫై డైరెక్ట్, LDAC వంటి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
Xiaomi Pad 8 ధర 8 Gb రామ్ 12 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.33,999 తో ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మొబైల్ రూ.43,999 తో విక్రయిస్తున్నారు. మార్చి 17 నుంచి ఈ మొబైల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అమెజాన్ వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉండనుంది. అయితే దీనిని ఎస్బిఐ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే వర్తిస్తుంది.