Samyuktha Menon Peddi item song: ఈ నెల 30 న విడుదల అవ్వాల్సిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) చిత్రం జూన్ నెలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ విడుదల తేదీ ఎప్పుడు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు. కొన్ని సన్నివేశాలను గత కొద్దిరోజులుగా రీ షూట్ చేస్తున్నారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. AR రెహ్మాన్ సెకండ్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించడం లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అయితే ఈ ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ రేపటి నుండి హైదరాబాద్ లోని వనస్థలిపురం లో షూట్ చేయబోతున్నారు. ఈ ఐటెం సాంగ్ కోసం మేకర్స్ ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని సంప్రదించారు.
ముందుగా బాలీవుడ్ లో బడా హీరోయిన్స్ ని ట్రై చేశారు. కానీ వాళ్ళు రెమ్యూనరేషన్ భారీ గా డిమాండ్ చేయడం తో మేకర్స్ అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ ని సంప్రదించారు , ఆమె కూడా 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చెసింది. కానీ మేకర్స్ రిజెక్ట్ చేశారు. ఇక చివరికి మానస వారణాసి ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేశారు, కానీ చివరికి సంయక్త మీనన్ ని ఫైనల్ చేశారు. ఈ ఐటెం సాంగ్ లో ఆమె రామ్ చరణ్ తో కలిసి చిందులు వెయ్యబోతుంది. ఇప్పటి వరకు కేవలం హీరోయిన్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తూ వచ్చిన సంయుక్త మీనన్ , మొట్టమొదటి సారి తన కెరీర్ లో ఈ సినిమా ద్వారా ఐటెం సాంగ్ తో మన ముందుకు రాబోతుంది.
ఈ ఐటెం సాంగ్ చేయడం కోసం ఆమె రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట . ఈ ఐటెం సాంగ్ కి కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. రీ ఎంట్రీ తర్వాత జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ‘చికిరి చికిరి’, అదే విధంగా ‘రయ్ రయ్ రారా’ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన ఈ పాటకు సంబంధించిన రీల్స్ కనిపిస్తున్నాయి. అలాంటి బ్లాక్ బస్టర్ కొరియోగ్రఫీ ని అందించిన జానీ మాస్టర్, ఈ ఐటెం సాంగ్ కి ఎలాంటి కొరియోగ్రఫీ అందించబోతున్నాడో చూడాలి. త్వరలోనే ఈ పాటని కూడా విడుదల చేయడానికి సిద్ధం గా ఉన్నారు మేకర్స్.