https://oktelugu.com/

శివుని విగ్రహం రూపంలో ఎందుకు పూజించరు?

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టికి మూలమని చెబుతుంటారు. ఈ ముగ్గురిలో శివుడును ప్రధాన దేవుడిగా భావిస్తారు. మన భారతదేశంలో ఎన్నో శివ మందిరాలలో శివునికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ అన్నింటిలోనూ కేవలం మనకు శివలింగం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఏ శివాలయంలో కూడా విగ్రహ రూపంలో కనిపించడు. కేవలం శివుడు లింగరూపంలో మాత్రమే పూజలందుకుంటాడు. అయితే శివుని విగ్రహం రూపంలో ఎందుకు పూజించరు? అందుకు గల కారణం ఏమిటో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 21, 2020 / 09:15 AM IST
    Follow us on

    బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టికి మూలమని చెబుతుంటారు. ఈ ముగ్గురిలో శివుడును ప్రధాన దేవుడిగా భావిస్తారు. మన భారతదేశంలో ఎన్నో శివ మందిరాలలో శివునికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ అన్నింటిలోనూ కేవలం మనకు శివలింగం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఏ శివాలయంలో కూడా విగ్రహ రూపంలో కనిపించడు. కేవలం శివుడు లింగరూపంలో మాత్రమే పూజలందుకుంటాడు. అయితే శివుని విగ్రహం రూపంలో ఎందుకు పూజించరు? అందుకు గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత ఈ తప్పు చేస్తున్నారు?

    మనదేశంలో శివుని లింగ రూపంలో పూజించడం సింధూ నాగరికత కాలం నుంచే ఉంది. పూర్వకాలం శివుని లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలోనే పూజించేవారు. ప్రస్తుతం విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజించడానికి ఒక కారణం ఉంది. వరాహ పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ కథలో భృగుమహర్షి ఆ శివుని కలవటానికి కైలాసానికి చేరుకుంటాడు. అయితే కైలాసంలో శివతాండవం చేస్తున్న శివుడు భృగు మహర్షిని గమనించి ఉండడు. దీంతో ఆగ్రహం చెందిన భృగుమహర్షి శివుడికి శాపం పెడతారు. ఇప్పటి నుంచి ఎవరూ కూడా నీకు విగ్రహ రూపంలో పూజలు అందించరు. కేవలం లింగ రూపంలో మాత్రమే పూజలు అందుకోవాలని భృగుమహర్షి శపించాడు.

    Also Read: 9 నెలల తరువాత షాప్ తెరిచి షాకైన వ్యాపారి.. ఏం జరిగిందంటే..?

    ఈ శాపం కారణంగా అప్పటినుంచి శివుడిని కేవలం విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజిస్తారు. అయితే ఈ లింగంలో త్రిమూర్తులు కొలువై ఉంటారని ప్రతీతి శివలింగంలో ఉన్న వృత్తాకార ఆధారాన్ని బ్రహ్మ పీఠం అంటారు. మధ్యలో ఉండే గిన్నె వంటి ఆకారాన్ని విష్ణువు గా భావిస్తారు. పైన ఉన్నటువంటి స్థూపాకార బాగాన్ని శివుడి గా భావిస్తారు. ఈ విధంగా త్రిమూర్తులు ముగ్గురు శివలింగంలో కొలువై ఉంటారని ప్రతితీ.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం