TATA Punch Car: ఫ్యామిలీ అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో కారు తప్పనిసరి అయింది. టూర్ కు వెళ్లాలన్నా.. విహారయాత్రకు పయనించాలన్నా ఫ్యామిలీతో ఇతర వాహనాల్లో వెళ్లడం ఇబ్బందిగా మారింది. కరోన పాండమిక్ తరువాత నుంచి చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం సొంతంగా కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కార్లు కొనేవారి సంఖ్య పెరుగుతుండడంతో కంపెనీలు సైతం వారికి అనుగుణంగా మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వారు కొనేస్థాయిలో ధరలను సైతం తగ్గిస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ ధరల విషయంలో మిగతా వాటికి పోటీనిస్తూ ప్రత్యేక మోడల్ ను తయారు చేసింది. ఆ కారు వివరాలేంటో చూద్దాం.
కార్లను ఎక్కువగా ఇష్టపడేవారు SUV లకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కానీ వాటి ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అయితే SUV ఫీచర్స్ అందిస్తూనే ఫ్యామిలీకి అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేస్తుంది టాటా కంపెనీ. ఈ కంపెనీ నుంచి రిలీజైన లేటేస్ట్ మోడల్ ‘పంచ్’ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సేఫ్టీ ఫీచర్స్ తో పాటు ధర తక్కువ కలిగిన కారుగా పేరు తెచ్చుకుంటోంది. దీంతో ఈ మోడల్ కు ఆటోమోబైల్ రంగం 5 స్టార్ రేటింగ్ ను ఇచ్చింది. ఈ కారు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?
టాటా పంచ్ డ్యూయల్ టోన్ బంపర్లు, ఫాగ్ లైట్లు, సింగిల్ స్లాట్ గ్రిల్, 16 ఇంచుల డ్రయూయల్ టోనఠ్ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, 90 డిగ్రీల ఓపెనింగ్ డోర్లు, ఎల్ ఈడీ లైట్లు ఉన్నాయి. ఎల్ఈడీ డిఆర్ఎల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఆకట్టుకుంటాయి. ఈ కారు మొత్తం స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ 1.2 లీటర్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ తో నడుస్తుంది. 84 బీహెచ్పీ శక్తి, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంది. ఈ బ్రాండ్ మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి.
2021 అక్టోబర్ 20న టాటా ‘పంచ్’ మార్కెట్లోకి వచ్చింది. వచ్చిన కొద్ది నెలల్లోనే దీని అమ్మకాలు జోరందుకున్నాయి. ఆటోమోబైల్ మార్కెట్లో ఇప్పటి వరకు మారుతి సుజుకి స్విప్ట్, హుందాయ్ గ్రాండ్ ఐ 10 లాంటి వాటితో టాటా పంచ్ పోటీ పడుతోంది. దీంతో ‘పంచ్’ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత మార్చిలో 10,894 విక్రయాల్లో టాప్ 10 కార్ల లిస్టులో పంచ్ ప్రవేశించడం విశేషం. పంచ్ ప్రభావంతో వెన్యూ, విటారా కూడా వెనక్కి వెళ్లాయి.