Sreemukhi Marriage: శ్రీముఖి సడన్ షాక్ ఇచ్చారు. ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. శ్రీముఖి పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా శ్రీముఖి వివాహం ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. కొన్నాళ్లుగా ఆమె పెళ్లి మీద పలు కథనాలు వినిపించాయి. ఇటీవల హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారని గట్టిగా వినిపించింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించారని, ఇక పెళ్లే తరువాయి అంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. కొందరు నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ఫోటో బ్లర్ చేసి పెళ్లి కొడుకు అని చెబుతున్నారని శ్రీముఖి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కుదిరితే ఖచ్చితంగా చెబుతాను. అప్పటి వరకు తప్పుడు వార్తలు రాయడం మానేయండని ఆమె ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె పెళ్లి ఫోటోలు తెరపైకి రాగా రహస్యంగా వివాహం చేసుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
పట్టు చీర, నగలు ధరించిన శ్రీముఖి తలకు బాసికం కట్టుకుంది. ఆమె పెళ్లి కూతురు గెటప్ లో అదిరిపోయారు. పెళ్లి కూతురుగా ముస్తాబై వీడియో చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతుంది. అయితే అది షూటింగ్ లో భాగం కావచ్చు. శ్రీముఖి పెళ్లి చేసుకునే ఆస్కారం లేదని కొందరు వాదిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిగా, యాంకర్ గా సత్తా చాటుతున్నారు.
చెప్పాలంటే యాంకరింగ్ లో శ్రీముఖి టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఆమె చేతిలో పలు షోలు ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. భోళా శంకర్ మూవీలో శ్రీముఖి రోల్ సర్ప్రైజ్ చేస్తుందట. చిరంజీవితో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఆమెకున్న క్రేజ్ రీత్యా హీరోయిన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయట. అయితే ఆషామాషీ చిత్రాల్లో నటించను అంటున్నారట. కొంచెం పేరున్న హీరోలు, దర్శకులతో పని చేస్తే కెరీర్ కి భరోసా ఉంటుందని భావిస్తున్నారట.