Vivo V2025: మార్కెట్లోకి ఎన్ని మొబైల్స్ వచ్చినా.. ప్రముఖ కంపెనీలకు చెందిన ఫోన్లకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు. అందుకే ఈ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త వాటిని ప్రవేశపెడుతుంటారు. ప్రముఖ కంపెనీ Vivo లేటెస్ట్ గా V6 2025 పేరిట కొత్త ఫోన్ ను ఆవిష్కరించింది. ఇది నేటి వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లు ఉండడంతో పాటు కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఫోటోగ్రఫీ తో పాటు ఎక్కువగా మొబైల్ పై ఆధారపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. మరి దీని ఫీచర్లు, ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Vivo కంపెనీకి చెందిన V6 2025 కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో 50 MP ప్రధాన కెమెరాను అమర్చారు. ఈ కెమెరాతో ఏఐ ఫోటోలను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారితో పాటు వెడ్డింగ్ షూట్ చేసేవారికి కూడా ఈ మొబైల్ కెమెరా అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా పగలు, రాత్రి సమయాల్లోనూ వాతావరణంతో సంబంధం లేకుండా కావాల్సిన ఫోటోలను క్యాప్చర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఫోర్ట్ రేట్ సబ్జెక్టులను ప్రధానంగా నిలబెడుతుంది. ఇది రాత్రి సమయంలో ఫోటోలు తీసే వారికి తక్కువ కాంతితో ఫోటోలను మెరుగు పరుస్తుంది. సెల్ఫీలు, వీడియోలకు కూడా ఈ కెమెరా సపోర్ట్ గా నిలుస్తుంది.
వివో v6 2025 మొబైల్ డిస్ప్లే అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇందులో 6.77 అంగుళాల curved డిస్ప్లేను చూడొచ్చు. ఇది 5000 nits బ్రైట్నెస్ వస్తుంది. HDR సపోర్టుతో 120 Hz రిఫ్రిజిరేట్ తో ఆకట్టుకుంటుంది. అలాగే Amoled డిస్ప్లే ఈ మొబైల్ కు పెద్ద హైలెట్గా ఉండనుంది. ఇది ప్రకాశవంతమైన వీడియోలను కంటికి ఇంపుగా చూపిస్తుంది. యానిమేషన్, గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ప్రతి మొబైల్ కు బ్యాటరీ ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది. రోజంతా వినియోగించినా.. వారికి అనుగుణంగా ఉండే విధంగా ఇందులో బ్యాటరీ సెటప్ ను చేర్చారు. ఈ మొబైల్లో 65,00 mAh బ్యాటరీని సెట్ చేశారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంగ్ లైఫ్ వస్తుంది. ఫోటోలు, వీడియోలు యూస్ చేసే వారికి మీ బ్యాటరీ కంఫర్ట్ గా ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు సైతం ఫాస్ట్ గా చార్జింగ్ కావడానికి సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఫాస్ట్ గా మూవ్ కావడానికి ఇందులో 7 జెన్ ఫోర్ ఆర్ సిమిలర్ ఎఫిసెంట్ చీప్ సెట్టును అమర్చారు. అలాగే 16gb రామ్ ఉండడంతో నేటి యూత్ కు అనుగుణంగా ఈ మొబైల్ పనిచేస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ ను రూ.36,999 తో విక్రయించే అవకాశం ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అదరపు ఫీచర్లు కావాలనుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉంది.