Honda Shine 125 Price Mileage: రోజువారి అవసరాలకు.. కార్యాలయాలకు వెళ్లే వారికి బైక్ తప్పనిసరి. అయితే ఈ సమయంలో తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాటికోసం సర్చ్ చేస్తారు. ప్రస్తుతం ఏ బైక్ కొనుగోలు చేయాలన్న లక్ష రూపాయల పై మాటే ఉంది. కానీ కొనుగోలు శక్తిని పెంచడానికి కొన్ని కంపెనీలు తక్కువ ధరకే ఆకర్షణీయమైన బైక్ లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ప్రముఖ Honda కంపెనీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన వాహనాలను వినియోగదారులకు అందించింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త వాటిని ప్రవేశపెడుతోంది. అయితే హోండా వాహనాలు ధర ఎక్కువగా ఉంటాయని భావన చాలామందిలో ఉంది. కానీ ఇప్పుడు రూ.70,000 నుంచి 80,000 లోపు ఉండే ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరి దీని మైలేజ్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Honda కంపెనీకి చెందిన shine గురించి ద్విచక్ర వాహనాన్ని వాడే వారందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ బైక్ కొత్త తరహాలో వినియోగదారులను ఆకర్షిస్తుంది. Shine 125 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొత్త వెర్షన్ ఫ్లెయిన్ మీటర్ కన్సోల్, అద్భుతమైన స్పీడోమీటర్, అందంగా ఉండే ఇంధనం గేజ్, భద్రతను ఇచ్చే CBS బ్రేకింగ్ సిస్టం ను అమర్చారు. కంట్రోల్ కావడానికి డిస్క్ బ్రేక్ వంటివి కూడా అమర్చారు. ఈ బైక్ లో 125 సిసి ఇంజన్ ను అమర్చారు. దీంతో పార్కింగ్ చేసే సమయంలో.. బ్రేకింగ్ సమయంలో తక్కువ వైబ్రేషన్ ఇస్తుంది. ట్రాఫిక్ లో ఒకేసారి ఆగి.. తిరిగి వెంటనే స్టార్ట్ కావడంలో సహకరిస్తుంది. ఈ బైక్ లో ఉండే గేర్లు మృదువుగా మారుతూ ఉంటాయి. రైడింగ్ చేసినప్పుడు ఎలాంటి అలసట ఉండదు. దీంతో ప్రతిరోజు ఉద్యోగాలకు.. వ్యాపార కార్యకలాపాలకు.. దూర ప్రయాణాలు చేసే వారికి దీనిపై ప్రయాణం చేస్తే ఎలాంటి అలసట అనిపించదు. అలాగే రోడ్లు ఎలా ఉన్నా వాటికి తగినంగా శాఖబ్జాల్ ఉండడంతో వైబ్రేషన్ తక్కువగా వస్తుంది.
ఈ బైక్ లో ఉండే ఇంజన్ లీటర్ ఇంధనానికి 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇంధన ఖర్చులను ఆదా చేసుకోవాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీని నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ వారికి ఆదాయం సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో హోండా కంపెనీకి చెందిన వాహనాలకు అత్యంత ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ 125 సిసి బైక్ కూడా వినియోగదారులను ఆకర్షిస్తుందని అంటున్నారు. దీనిని కొనుగోలు చేయడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.