Vivo T5 5G: ప్రస్తుత కాలంలో మొబైల్ లో బ్యాటరీ విషయంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే రోజువారి వినియోగదారులకు మొబైల్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారికోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మెరుగైన బ్యాటరీని అందించి మొబైల్స్ లో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Vivo కంపెనీ కొత్తగా తీసుకురాబోయే మొబైల్ లో 7200 mAh బ్యాటరీని చేర్చనుంది. ఈ బ్యాటరీ 44 W చార్జింగ్ సపోర్ట్ తో పనిచేయనుంది. అయితే కేవలం బ్యాటరీ విషయంలో మాత్రమే కాకుండా మిగతా స్పెసిఫికేషన్స్ లో కూడా అప్డేట్ గా ఉన్న ఈ మొబైల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో తెలుసా..?
2026 మార్చి 17న Vivo కొత్త మొబైల్ T5 5G ఇండియాలో లంచ్ కాబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Vivo T4 X మొబైల్ కు కొనసాగింపుగా దీనిని తయారు చేశారు. అయితే పాత మొబైల్ కంటే ఇందులో కొత్తగా 7400 టర్బో చిప్ సెట్ ఉండనుంది. అంతేకాకుండా ఇందులో ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని బ్యాటరీ ఉండనుంది. ఈ మొబైల్ లో 7200 mAh బ్యాటరీ ఉండగా ఇది 44 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. స్ట్రీమింగ్, గేమింగ్ తో పాటు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోరుకునే వారికి చార్జింగ్ ఇబ్బంది లేకుండా ఇది పనిచేస్తుంది. ఈ కొత్త మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధార్ origin OS 6 పై పనిచేస్తుంది. అలాగే నీటి నుంచి రక్షణ కోసం IP 68 , IP 69 రేటింగ్ కలిగి ఉంది.
ఇది మార్కెట్లోకి వస్తే ధర రూ.23,000 లోపే ఉంటుందని అంటున్నారు. దీంతో మిడ్ రేంజ్ పీపుల్స్ ఈ మొబైల్స్ కొనడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో నాణ్యమైన కెమెరా కూడా అమర్చే అవకాశం ఉంది. 50 MP మెయిన్ కెమెరా ఉండగా..8 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. 6.72 అంగుళాల HD +డిస్ప్లే ఉండడంతో మూవీస్ తో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్న మొబైల్స్ లో కంటే ఇందులో ఫీచర్స్ కూడా హైలెట్గా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.