Homeబిజినెస్OnePlus premium smartphone: ప్రీమియం మొబైల్ ను విడుదల చేసేందుకు One Plus రెడీ.. ధర...

OnePlus premium smartphone: ప్రీమియం మొబైల్ ను విడుదల చేసేందుకు One Plus రెడీ.. ధర చూస్తే మతిపోతుంది..

OnePlus premium smartphone: Oneplus నుంచి అనేక ఆకట్టుకునే మొబైల్స్ మార్కెట్లోకి ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ కంపెనీ నేటితరం వినియోగదారులను ఆకర్షించేందుకు అప్డేట్ చేసిన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇటీవల కొత్తగా వచ్చిన చర్చ ప్రకారం Oneplus నుంచి త్వరలో 16 వెర్షన్ మార్కెట్లోకి రాబోతుంది అని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇలా ఆన్లైన్లో చర్చలు పెడుతున్నారు. అయితే వన్ ప్లస్ మొబైల్ అంటే ప్రత్యేకంగా ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటివారు ఈ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

త్వరలో మార్కెట్లోకి రాబోయే వన్ ప్లస్ మొబైల్ 16 వెర్షన్ సాఫ్ట్వేర్ నేటి వినియోగదారులకు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ LPDDR 5 అంటే ఎక్కువగా ర్యామ్ ను అందిస్తుంది. అలాగే UFS 4.1 స్టోరేజ్ని కలిగి ఉంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. ఈ మొబైల్లో 1.5 k resolution తో కూడిన డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 240 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే OLED ప్యానల్ కలిగిన ఇందులో నాణ్యమైన కెమెరా పని తీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది..

ఈ కొత్త మొబైల్ లో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. అలాగే పెరిస్కోప్, హై డిటైల్ జూమ్ కోసం కూడా 200 MP రిసోల్యూషన్ తో పనిచేస్తుంది. ఇదే మెగా పిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా, వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఇందులో ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని విధంగా 9000 mAh బలమైన బ్యాటరీని చేర్చారు. ఇది 120 W వైర్డ్ చార్జింగ్తో సపోర్ట్ చేయగా.. 50 W వైర్లెస్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రీమియం ఫీచర్లు కూడా ఈ మొబైల్ లో కనిపిస్తాయి. వీటిలో అల్ట్రాసోనిక్ 2.0 ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, సన్నగా ఉండే జెజిల్స్, డ్యూయల్ కొక్సియల్ స్పీకర్లు వంటివి నేటి యూత్ కు అనుగుణంగా ఉండనుంది.

2026 అక్టోబర్లో చైనాలో మార్కెట్లోకి వచ్చే ఈ మొబైల్ ధర రూ.67,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే భారత్లో విడుదల అయ్యే సమయానికి దీని ధర రూ.90,000 ఇరగవచ్చని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular