Toyota : టయోటా, మారుతి సుజుకి అనేక మోడళ్లను రీ-బ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో బాలెనో గ్లాంజా, గ్రాండ్ విటారా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఎర్టిగా, రుమియన్, ఫ్రాంక్స్, అర్బన్ క్రూజర్ టైసర్ రీ-బ్యాడ్జ్ వెర్షన్‌లు ఉన్నాయి. ఈ పార్టనర్ షిప్ ఉద్దేశ్యం మారుతి సుజుకి తక్కువ ఖర్చుతో కూడిన తయారీ, టయోటా బ్రాండ్ గుర్తింపు, అమ్మకాల నెట్‌వర్క్‌ను ఉపయోగించడం. అయితే, టయోటా ఈ మారుతి లాంటి కార్లు అసలైన మోడల్‌లతో పోలిస్తే అమ్మకాలలో చాలా వెనుకబడి ఉన్నాయి. కానీ ఒక మోడల్ మాత్రం గతేడాది ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది.
Also Read : కార్లు బాగా అమ్ముడుపోయినా మారుతికి నష్టాలు.. ఎందుకో తెలుసా?
టయోటా రుమియన్ 7-సీటర్ MPV, ఇది మారుతి ఎర్టిగా రీ-బ్యాడ్జ్ వెర్షన్‌గా విక్రయిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2025లో ఈ కారును మొత్తం 21,878 మంది కొనుగోలు చేశారు. అయితే ఇది అదే సమయంలో మారుతి ఎర్టిగా 1,90,974 అమ్మకాలతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ, రుమియన్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 266శాతం పెరిగాయి. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5,973 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది.
టయోటా రుమియన్ ధర
టయోటా రుమియన్ ధర రూ.10.54 లక్షల నుండి రూ.13.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. టయోటా రుమియన్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.54 లక్షల నుండి ప్రారంభమై రూ.12.43 లక్షల వరకు ఉంటుంది. టయోటా MPV ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.12.04 లక్షల నుండి ప్రారంభమై రూ.13.83 లక్షల వరకు ఉంటుంది. రుమియన్ మిడ్-స్పెక్ S వేరియంట్ CNGలో కూడా లభిస్తుంది, దీని ధర రూ.11.49 లక్షలు. మరోవైపు మారుతి ఎర్టిగా బేస్ మోడల్ ధర రూ.8.96 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.13.25 లక్షల వరకు (సగటు ఎక్స్-షోరూమ్) ఉంటుంది. రుమియన్ బేస్ మోడల్ ఎర్టిగా కంటే దాదాపు లక్షన్నర రూపాయలు ఎక్కువ.
టయోటా రుమియన్ ఫీచర్లు
టయోటా రుమియన్ ఫీచర్ల గురించి మాట్లాడితే.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ , ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ కూడా ఉన్నాయి. టయోటా రుమియన్ మారుతి ఎర్టిగా, మారుతి XL6, కియా కారెన్స్‌తో పోటీపడుతుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి ఇన్విక్టో వంటి పెద్ద MPVలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
Also Read: టోల్‌ప్లాజాలకు గుడ్‌బై.. దేశంలోనే తొలిసారి ఆగకుండా టోల్ కట్!