Homeబిజినెస్Maruti : కార్లు బాగా అమ్ముడుపోయినా మారుతికి నష్టాలు.. ఎందుకో తెలుసా?

Maruti : కార్లు బాగా అమ్ముడుపోయినా మారుతికి నష్టాలు.. ఎందుకో తెలుసా?

Maruti : దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కంపెనీ లాభాలు క్షీణించాయి. గత ఏడాది మార్చిలో రూ.3,952 కోట్లుగా ఉన్న పన్ను అనంతర లాభం (PAT) ఈ ఏడాది రూ.3,911 కోట్లకు తగ్గింది. అంటే ఏడాది వ్యవధిలో కంపెనీ లాభం 1 శాతం తగ్గింది. అయితే అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం PAT పెరిగింది.

Also Read : లీటరుకు ఏకంగా 34 కిమీ మైలేజ్.. రోజూ ప్రయాణించడానికి బెస్ట్ కార్లు ఇవే !

కంపెనీ ఆదాయం పెరిగినా..
ఒకవైపు ఏడాదిలో కంపెనీ లాభం 1 శాతం తగ్గినా, మరోవైపు కంపెనీ ఆదాయం మాత్రం పెరిగింది. మారుతి స్టాక్ మార్కెట్‌లో తన ఫైలింగ్‌ను సమర్పించింది. అందులో Q4FY25లో మొత్తం ఆదాయం రూ.40,920 కోట్లుగా ఉందని తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.38,471 కోట్ల కంటే 6.4శాతం ఎక్కువ. ఇందులో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.38,842 కోట్లు కాగా, ఇతరత్రా ఆదాయాల ఆధారంగా కంపెనీ రూ.2,078 కోట్లు ఆర్జించింది.

లాభాల్లోనూ క్షీణత
మారుతి సుజుకి శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో ఫైలింగ్ చేసింది. కంపెనీ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇందులో పన్ను రహిత లాభంతో పాటు లాభాల్లో కూడా ఏడాది ప్రాతిపదికన క్షీణత నమోదైంది. మారుతి లాభం గత ఏడాదితో పోలిస్తే 4.3శాతం తగ్గి రూ.3,711 కోట్లకు చేరుకుంది. 2024 ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.3,878 కోట్లుగా ఉంది.

కంపెనీ షేర్లలో పతనం
మారుతి సుజుకి ఇండియా లాభాల్లో తగ్గుదల ప్రభావం దాని షేర్లపై కనిపించింది. మారుతి షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ షేర్లు ఈరోజు రూ.11866.35 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ సమయంలో రూ.12047 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్కెట్ ముగిసే సమయానికి షేర్లు దాదాపు రూ.250 వరకు పడిపోయాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version