AC Ton : ఏప్రిల్ నెలాఖరుకు చేరుకున్నాం.. మే నెల రాబోతుంది. ఏప్రిల్ నెలలోనే ఎండలు ఇలా దంచికొడుతుంటే.. మరి మే నెలలో ఇంకా ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో భరించలేని వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు వాడటం మొదలుపెట్టారు. కానీ ఏసీ గురించి మాట్లాడినప్పుడల్లా ఇంట్లో ఎన్ని టన్నుల ఏసీ పెట్టారని అడుగుతుంటారు. అసలు ఏసీతో ఉపయోగించే టన్ను అనే పదం అర్థం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది టన్ను అనే పదాన్ని ఏసీ బరువుతో ముడిపెడతారు. కానీ టన్నుకు బరువుతో సంబంధం లేదు. అది కూలింగ్ కెపాసిటీకి సంబంధించినది.
Also Read : ఈ ఏసీ ఉంటే కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. రాత్రింబవళ్లు వాడినా నో ప్రాబ్లమ్!
కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ముందుగా టన్ను అంటే ఏమిటో తెలుసుకోవాలి. టన్ను అనేది కూలింగ్ కెపాసిటీకి సంబంధించినది. కాబట్టి ఏసీ కొనేటప్పుడు టన్ను గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఎక్కువ టన్నుల ఏసీ ఎక్కువ ప్రాంతాన్ని బాగా చల్లబరుస్తుంది.
ఎన్ని టన్నుల ఏసీ ఎంత వేడిని తగ్గిస్తుంది?
చిన్న గదికి 1 టన్ను ఏసీ సరిపోతుంది. కానీ గది పెద్దగా ఉంటే కనీసం 1.5 టన్నులు లేదా 2 టన్నుల కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీ కొనాలి. 1 టన్ను కెపాసిటీ ఉన్న ఎయిర్ కండీషనర్ ఒక గంటలో 12000 BTU (బ్రిటిష్ థర్మల్ యూనిట్) వేడిని తొలగించగలదు. 1.5 టన్నుల కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీ అయితే 18000BTU (బ్రిటిష్ థర్మల్ యూనిట్) వేడిని తొలగించగలదు. 2 టన్నుల ఏసీ 24000BTU (బ్రిటిష్ థర్మల్ యూనిట్) వేడిని తొలగించగలదు.
ఈ సమాచారం తర్వాత తర్వాతిసారి ఏసీ కొనడానికి వెళ్ళినప్పుడు ఎన్ని టన్నుల ఏసీ ఎంత వేడిని తొలగించగలదో దీనిని బట్టి గుర్తుంచుకోండి. గదికి తగిన టన్నుల ఏసీ కొనకపోతే డబ్బులు వృథా అవుతాయి. సరైన కూలింగ్ కూడా లభించదు.