Top Selling Cars 2024: జనవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు ఇవే..

2024 జనవరి లో కార్ల కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఎప్పటి లాగేమారుతి అగ్ర స్తానంలో ఉండేందుకు ప్రయత్నించి సక్సెస్ అయింది.

Written By: Chai Muchhata, Updated On : February 17, 2024 10:57 am

Top selleing Sales car in janauary 2024

Follow us on

Top Selling Cars 2024:  2024 సంవత్సరంలో కొత్త కార్లను రిలీజ్ చేస్తున్నట్లు చాలా కంపెనీలు ప్రకటించాయి. ఇదే సమయంలో తమ ఉత్పత్తులను పెంచుకోవడంలో తీవ్రంగా కృషి చేశాయి. 2024 జనవరి లో కార్ల కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఎప్పటి లాగేమారుతి అగ్ర స్తానంలో ఉండేందుకు ప్రయత్నించి సక్సెస్ అయింది. అయితే ఈసారి టాటా, హ్యుందాయ్ లో తమ 2023 డిసెంబర్ లో ఉన్న తమ స్థానాలు కోల్పోయాయి. ఏ కంపెనీ ఎన్ని కార్లు విక్రయించిందో ఇప్పుడు చూద్దాం..

కొత్త ఏడాది ప్రారంభ నెలలో మారుతి జోరు కంటిన్యూ అయింది. ఈనెలలో కంపెనీ మొత్తం 1.67 లక్షల యూనిట్లు విక్రయించింది. నెలవారీ అభివృద్ధిలో దాదాపు 60 శాతం పైకి ఎగబాకింది. సంవత్సరంలో 13 శాతం వృద్ధి సాధించింది. మారుతి తరువాత హ్యుందాయ్ రెండోస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ జనవరి నెలలో 57,115 యూనిట్ల విక్రయం చేసింది. గత డిసెంబర్ లో ఇది 42,750 కార్లను విక్రయించింది. 2023 డిసెంబర్ నెలలో రెండో స్థానంలో ఉన్న టాటా ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. జనవరి నెల మొత్తం 53,635 యూనిట్లు విక్రయించింది.

దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి. ఈ కంపెనీ జనవరి నెలలో 40 వేల యూనిట్లు విక్రయించింది. గత అంతకుముందు నెలతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు పెరిగాయి. దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా దేశంలో దూసుకుపోతుంది. ఈ కంపెనీ 2023 తో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించింది. జనవరి నెలలో దీని విక్రయాలు 23,000 యూనిట్లుగా ఉన్నాయి.

టయోటా సైతం తన కార్ల విక్రయాలను పెంచుకుంది. డిసెంబర్ 2023 తో పోలిస్తే జనవరి నెలలో 8.5 శాతం అమ్మకాలు పెరిగాయి. ఈ ఒక్క నెలలో 10 వేల యూనిట్లు విక్రయించింది. హోండా కంపెనీ సైతం తన అమ్మకాల్లో వృద్ధి సాధించింది. నెలవారీ అమ్మాకాల్లో 10 శాతం వృద్ధితో పాటు వార్షిక అమ్మకాల్లో 11 శాతం పైకి వెళ్లింది. రెనాల్ట్ కార్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఈ కంపెనీ 27 శాతం ఎక్కువ యూనిట్లను విక్రయించింది. అయితే వార్షిక విక్రయాల్లో నష్టాలను చూసిన ఏకైక కార్ల కంపెనీగా ఎంజీ నిలిచింది. దీని అమ్మకాలు 13శాతానికి పడిపోయాయి. వార్షిక అమ్మకాలు 7 శాతానికి తగ్గాయి.