New EV Bikes : ఇప్పడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే హవా నడుస్తోంది. రాను రాను ప్రతి ఇంట్లో ఓ ఈవీ ఉండనుందనడం ఆశ్చర్యమేమీ కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు న్యూ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తాయి. దేశంలోని గోవాలో స్టార్టప్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కబీరా మొబిలిటీ లేటేస్టుగా రెండు ఈవీ బైక్ లను తయారు చేసి విడుదల చేసింది. వీటిలో ఒకటి 3000 ఎంకే 2, కేఎం 4000 ఎంకే 2. ఫాక్స్ కాన్ సహకారంతో ఉత్పత్తి చేసిన ఇవి అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్ ట్రెయిన్ తో ఆకట్టుకుంటున్నాయి. దీని ధర వివరాల్లోకి వెళితే..
3000 కేఎం బైక్ 4.1 kWh బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 178 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే కేఎం 3000 బైక్ V 5.15 kWh బ్యాటరీ ద్వారా పనిచేస్తూ 201 కిలోమీట్ల మైలేజ్ వరకు దూసుకెళ్తుంది. రెండు బైక్ లు ఒకే పనితీరును కనిపించిన దేని ప్రత్యేకత దానికే ఉంది. రెండింటిలోనూ 12 kW గరిష్ట శక్తి,ి 192 గరిష్టంగా టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటిని 1500 వాట్స్ బోర్డు ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాన్ని కల్పించారు.
ఎంకే 2కేఎం 4000 కొత్త స్టైల్ తో ఆకర్షిస్తుంది. ఇది ఎకో మోడ్ లో 130 కిలోమీటర్లు, సిటీ మోడ్ లో 150 కిలోమీటర్ల, స్పోర్ట్ మోడ్ లో 80 కిలోమీటర్లుగా ఉంది. మొత్తం నాలుగు వేరియంట్లలో 120 Kmph గరిష్ట వేగంతో 4.5 సెక్లన్లలో 0 నుంచి 60 Kmph వేగాన్ని కలిగి ఉంది. కేఎం 3000 సైతం ఇదే వేరియంట్ ను కలిగి ఉంది. ఈ రెండు బైక్ లు ఫుల్ చార్జింగ్ కావాలంటే 3 నుంచి మూడున్నర గంటల సమయం పడుతుంది.
ఈ వాహనాలు 2080 ఎంఎం పొడవు, 702 ఎంఎం వెడల్పు, 1141 ఎంఎం ఎత్తు, 1412 ఎంఎం వీల్ బేస్ తో కలిగి ఉన్నాయి. ట్యూబ్ ఫ్రేమ్ లతో కలిపి 152 కిలోల బరువును కలిగిన ఇందులో 13 లీటర్ ఫ్రంక్ స్టోరేజ్ ద్వారా మోనో షాక్ అబ్జర్లర్లు ఉన్నాయి. వీటికి అదనంగా బ్లూటూత్,యాప్ కనెక్టివిటీతో పాటు ఐదు అంగుళాల టీఎఫ్టీ క్లస్టర్, స్విచ్ చేసేలా లైట్, డార్క్ థీమ్ లు ఉన్నాయి. అలాగే ఎల్ ఈడీలు, రీజెనరేటివ్ సిస్టమ్ తో కూడాిన డ్యూయెల్ ఛానెల్ సీబీఎస్ ఆకర్షిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.1.74 లక్షల నుంచి రూ.1.76 లక్షల వరకు విక్రయించనున్నారు.