Best Stylish Bikes 2026: బైక్ కొనే సమయంలో కొందరు మైలేజ్ గురించి ఆలోచిస్తారు. మరికొందరు మాత్రం స్టైలిష్ గా ఉండే వెహికిల్ కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారు ధరతో సంబంధం లేకుండా స్పోర్టీ లుక్ తో పాటు మోడ్రన్ లుక్ లో ఉండాలని అనుకుంటారు. అయితే 2026లో రోడ్లపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించే 5 స్టైలిష్ బైకులు ఏవో ఇప్పుడుచూద్దాం..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 (Royal Enfield Interceptor 650):
మోడ్రన్ రెట్రో క్లాసిక్ లుక్‌తో బైక్ ప్రియులను అమితంగా ఆకట్టుకునే బైక్ ఇది. ఇందులో 648cc, పారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ప్రయాణంలో అద్భుతమైన పవర్ తో పాటు క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జాస్ట్ సౌండ్‌ను అందిస్తుంది. క్రూయిజింగ్ కోసం, లాంగ్ రైడ్స్ కోసం ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ బైక్, తన క్రోమ్ ఫినిషింగ్ మరియు వింటేజ్ డిజైన్‌తో రోడ్డుపై వెళ్తుంటే పాతకాలపు రాయల్ లుక్‌ను గుర్తుచేస్తూ అందరి కళ్లూ తనవైపే తిప్పుకునేలా చేస్తుంది. దీని ధర సుమారు రూ. 3.35 లక్షలు (ఎక్స్-షోరూమ్).
కావసాకి Z650 (Kawasaki Z650):
మిడ్-వెయిట్ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్లో కావసాకి Z650 ఒక అద్భుతం. దీనికి ఉండే పదునైన ‘సుగోమి’ డిజైన్ ఫిలాసఫీ, అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్, మజిల్ ట్యాంక్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. ఇందులో 649cc, పారలల్-ట్విన్ ఇంజన్ ఉండడంతో అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్ను అందిస్తుంది. అటు సిటీ రోడ్లపై, ఇటు హైవేలపై దూసుకుపోవడానికి, స్టైల్‌తో పాటు పవర్‌ను ఆశించే రైడర్లకు ఇది బెస్ట్ ఛాయిస్. దీనిని సుమారు రూ. 7.26 లక్షల (ఎక్స్-షోరూమ్)తో కొనుగోలు చేయొచ్చు.
టీవీఎస్ అపాచీ RTX 300 (TVS Apache RTX 300):
టీవీఎస్ నుంచి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ ఇది. రఫ్‌గా, ఎంతో స్టైలిష్‌గా ఉండే దీని డిజైన్ అడ్వెంచర్ ప్రియులను కట్టిపడేస్తుంది. 299.1cc, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ 36 PS పవర్‌ను జనరేట్ చేస్తుంది. 200mm గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ 5 అంగుళాల TFT డిస్ప్లే వంటి మోడ్రన్ ఫీచర్లు రైడర్లను ఆకట్టుకుంటుంది. దీనిని కొనుగోలు చేయాలంటే రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వెచ్చించాలి.
అప్రిలియా RS 457 (Aprilia RS 457):
రేసింగ్ బైక్స్ ఇష్టపడే యువతకు అప్రిలియా RS 457 ఒక కలల బైక్. దీని సూపర్ స్పోర్ట్స్ ఏరోడైనమిక్ డిజైన్, స్ప్లిట్ LED హెడ్‌లైట్స్ , అగ్రెసివ్ ఫెయిరింగ్ లుక్ చూడగానే వావ్ అనిపిస్తాయి. 457cc, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్‌తో పర్ఫార్మెన్స్లో దూసుకుపోయే ఈ బైక్.. రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఎలక్ట్రానిక్స్ ఫీచర్లతో వస్తుంది. ట్రాక్ రేసింగ్ లుక్‌తో రోడ్లపై వెళ్తుంటే ఇది ఖచ్చితంగా అందరి చూపులను ఆకర్షిస్తుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 4.22 lakh (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
కేటీఎమ్ 200 డ్యూక్ (KTM 200 Duke):
యువతలో ఎప్పటికీ క్రేజ్ తగ్గని నెక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కేటీఎమ్ 200 డ్యూక్. దీని సిగ్నేచర్ ఆరెంజ్ కలర్ థీమ్, షార్ప్ ఎక్స్టెన్షన్స్, అగ్రెసివ్ స్టాన్స్ దీనికి ఒక యూనిక్ ఐడెంటిటీని ఇస్తాయి. 199.5cc, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అందించే ఇన్స్టంట్ పికప్ మరియు తేలికపాటి హ్యాండ్లింగ్ దీని సొంతం. సిటీ ట్రాఫిక్‌లో సులువుగా దూసుకుపోతూ, కాలేజ్ స్టూడెంట్స్ మరియు యంగ్ రైడర్ల స్టైల్ స్టేట్మెంట్గా ఈ బైక్ నిలుస్తుంది. దీనిని రూ. 2.00 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి విక్రయిస్తున్నారు.
