Today Gold price: బంగారం కొనుగోళ్లు మరోసారి తగ్గాయి. గత కొన్ని రోజులగా బంగారం ధరలు రూ.2500 కంటే ఎక్కువగా తగ్గింది. ఇప్పుడు మరోసారి తగ్గడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. రూ.లక్షకు పైగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు రూ.99 వేలకు దిగివచ్చింది. అయితే మరికొన్ని రోజుల పాటు బంగారం తగ్గుతుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇదే సమయం.. బంగారం వెంటనే కొనేయండి.. అని అంటున్నారు. మరి మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: ఒక చిన్న లవ్ స్టోరీ కి 300 కోట్ల కలెక్షన్స్.. అసలు ఇందులో ఏముంది…
బులియన్ మార్కెట్ ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.91,500 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,820గా ఉంది. సోమవారం కంటే మంగళవారం బంగారం ధరలు రూ.100 తగ్గింది. జూలై 25 నుంచి తగ్గుతూ వస్తోంది. అయితే మంగళవారం న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,970 పలుకుతోంది. ముంబయ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,820 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,820 పలుకుతోంది. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,820 పలుకుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,820 పలుకుతోంది.
Also Read : మొన్న ‘ఎయిర్ ఇండియా’.. ఇప్పుడు TCS.. అసలు TATA కంపెనీలకి ఏమవుతుంది?
బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. శనివారం వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం కిలో వెండిని రూ.1,26,000 పలుకుతోంది. అయితే వెండి ధరలు పెరిగే అవకాశం లేదని కొందరు అంటుండగా.. బంగారంనకు ప్రత్యామ్నాయంగా వెండి కొనుగోళ్లు ఉంటాయని అంటున్నారు.
బంగారం ధరలు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వివాహాది శుభకార్యాలతో పాటు కొన్ని శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే శుభకార్యాలు నిర్వహించుకునేవారు బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అని అంటున్నారు. ఎందుకంటే బంగారం మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.