Allu Arjun Movie Villain: భర్తను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. అందుకు భిన్నంగా భార్య కాళ్లకు ప్రతిదినం మొక్కుతాను అంటున్నాడు పాన్ ఇండియా నటుడు. అల్లు అర్జున్ హిట్ మూవీలో విలన్ గా చేసిన ఆ నటుడు ఎవరు? భార్య కాళ్లకు నమస్కారం పెట్టడం వెనుక కారణం ఏమిటీ?
పతియే ప్రత్యక్ష దైవమే… అన్నారు మన పూర్వికులు. నాగరిక సమాజంలో దీన్ని మహిళలే కాదు, పురుషులు కూడా అంగీకరించరు. అన్ని రంగాల్లో పురుషులతో మహిళలు పోటీపడుతున్న క్రమంలో భర్తకు భార్య ఏమాత్రం తక్కువ కాదు. అన్ని విధాలా సమానమే అంటున్నారు. ఆ మధ్య భర్తకు పాద పూజ చేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్ ని ఏకిపారేశారు. పురుషాధిక్య సమాజాన్ని ఆమె ప్రోత్సహిస్తుందని విమర్శలు గుప్పించారు. సదరు విమర్శలను ప్రణీత ఖండించారు. అనాదిగా మా కుటుంబంలో వస్తున్న సాంప్రదాయం. నా తల్లి చేసిందే నేను చేస్తున్నాను. అందులో తప్పేంటని కౌంటర్ ఇచ్చింది.
Also Read: అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కథేంటో తెలిసిపోయిందిగా…
పరిస్థితి ఆ విధంగా ఉంది. కాగా ఓ పాన్ ఇండియా నటుడు భార్య పాదాలకు మొక్కడం సంచలనం రేపింది. సదరు నటుడు ప్రతిరోజూ ఆ పని చేస్తాడట. భార్య కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడట. భార్యను అంతలా గౌరవిస్తున్న ఆ నటుడు ఎవరో కాదు రవి కిషన్(RAVI KISHAN). ఆయన పేరు చెబితే మనకు రేసు గుర్రం మూవీ గుర్తుకు వస్తుంది. అల్లు అర్జున్(ALLU ARJUN) హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన రేసు గుర్రం బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీలో మద్దాలి శివారెడ్డి పాత్రలో అలరించాడు రవి కిషన్.
ఈయన తాజాగా ఓ హిందీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. నేను ప్రతి రోజూ నా భార్య పాదాలకు నమస్కరిస్తాను… అన్నారు. రవి కిషన్ భార్య పేరు ప్రీతి. ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడట. తాను నటుడిగా స్థిరపడక ముందే ప్రీతి నమ్మి తనతో ఏడడుగులు వేసిందట. తన ప్రతి కష్టంలో తోడుగా ఉందట. సమస్యల్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిందట. అందుకే ప్రీతి అంటే రవి కిషన్ కి అంత గౌరవం, ప్రేమ అట.
Also Read: ఒక చిన్న లవ్ స్టోరీ కి 300 కోట్ల కలెక్షన్స్.. అసలు ఇందులో ఏముంది…
ముంబైలో పుట్టిన రవికిషన్ 1992లో విడుదలైన పీతాంబర్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో రేసు గుర్రం ఆయన మొదటి చిత్రం. అనంతరం పలు తెలుగు చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాడు. 2025 సంక్రాంతి రిలీజ్ డాకు మహారాజ్ మూవీలో రవి కిషన్ నటించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు.
आज मेरी शादी की सालगिरह है प्रीती शुक्ला मेरे दुःख की साथी महादेव से आप सबसे सदेव आशीर्वाद हम दोनो को मिले यही कामना आज गोरखपूर हू और प्रीती मुंबई लेकीन प्रेम वही जो ३५ साल पहले था #happyanniversary @PritiKishan pic.twitter.com/JX5agjNOQ5
— Ravi Kishan (@ravikishann) December 10, 2024