Anasuya Latest Photos: ఇంస్టాగ్రామ్ ని హీటెక్కించింది అనసూయ. తేనె కళ్ళతో సూటిగా చూస్తూ మనసులు దోచేసింది. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి..
అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ) ఇటీవల బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమె ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. 2022లో జబర్దస్త్ నుండి తప్పుకున్న అనసూయ.. అనంతరం ఇతర షోలకు కూడా గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో జబర్దస్త్ ప్రేక్షకులతో పాటు అభిమానులు ఆమెను బాగా మిస్ అయ్యారు. హైపర్ ఆది కారణంగానే జబర్దస్త్ వదిలేశానని బహిరంగంగా చెప్పి వివాదం రాజేసింది అనసూయ. జబర్దస్త్ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఎపిసోడ్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనసూయ మీద ఆది పంచ్ వేయగా.. ఇందుకే జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాను అంది.
Also Read: అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కథేంటో తెలిసిపోయిందిగా…
ఇప్పటికే హైపర్ ఆది మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అనసూయ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. అనసూయ ప్లేస్ లో వచ్చిన సౌమ్యరావును కూడా హైపర్ ఆది వేధించాడనే విమర్శలు తలెత్తాయి. అయితే ఈ ఆరోపణలను సౌమ్యరావు ఖండించింది. హైపర్ ఆది తనకు సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. కాగా అనసూయ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో రీఎంట్రీ ఇచ్చారు. స్టార్ మాలో గత ఏడాది ఈ షో మొదలైంది. అనసూయ తన మార్క్ చూపుతూ పొట్టి బట్టల్లో రచ్చ చేసింది.
శేఖర్ మాస్టర్ కి పోటీగా అనసూయ జాకెట్ తీసేయడం వివాదస్పదం అయ్యింది. ఆ ఎపిసోడ్ లో అనసూయ డ్రెస్ కొంచం అభ్యంతరకరంగా ఉంది. ఎప్పటిలానే అనసూయ తన డ్రెస్సింగ్ పై వచ్చిన విమర్శలను కొట్టిపారేసింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 ఇటీవల ముగిసింది. డ్రామా జూనియర్స్ లో అనసూయ ప్రస్తుతం సందడి చేస్తుంది. అలాగే చేతినిండా చిత్రాలతో నటిగా కూడా బిజీగా ఉంది. పెద్ది సినిమాలో ఓ పాత్ర ఖచ్చితంగా ఇవ్వాలంటూ దర్శకుడు బుచ్చిబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు అనసూయ చెప్పడం విశేషం.
Also Read: సిగరెట్లు కావాలని హీరోయిన్ రచ్చ.. బెడ్ పై పడుకొని వీడియో
సోషల్ మీడియాలో అనసూయ మీద నెగిటివిటీ ఓ రేంజ్ లో ఉంటుంది. దీనిపై అనసూయ స్పందించారు. పిచ్చి కామెంట్స్ చేసే వారిని బ్లాక్ చేస్తానన్న అనసూయ… దాదాపు 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అనసూయ కామెంట్స్ ట్రోల్స్ కి దారి తీశాయి. 20 లక్షల ఫాలోవర్స్ ఉన్న అనసూయ 30 లక్షల మందిని బ్లాక్ చేసిందా? ఎవరికైనా అది అసాధ్యం అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇక అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది. చీరకట్టులో కూడా సూపర్ గ్లామరస్ గా ఉన్న అనసూయ ఫోటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.



View this post on Instagram