కొత్త కారు కొనేవారికి ఇదే మంచి సమయం.. భారీగా తగ్గింపు ధరలు..

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకెళ్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా తన కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. వీటిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కారు పూై రూ.43 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది.

Written By: Srinivas, Updated On : June 7, 2024 2:49 pm

Maruthi suzuki cars

Follow us on

సాధారణగా పండుగ దినాల్లో.. ఏదైనా ప్రత్యేక రోజుల్లో కార్ల కొనుగోలుపై ఆఫర్లు ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలో వాటితో సంబంధం లేకుండా తమ సేల్స్ పెంచుకునేందుకు మధ్యలో ఆఫర్ల ప్రకటిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఓ కంపెనీ పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కంపెనీలోని దాదాపు అన్నికార్లపై తగ్గింపు ధరలో విక్రయిస్తున్నట్లు తెలిపింది. దీంతో కొత్తగా కారు కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం అని ఆటో మోబైల్ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ భారీ ఆఫర్లు ప్రకటించిన కంపనీ ఏది? ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకెళ్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా తన కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. వీటిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కారు పూై రూ.43 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ మోడల్ ఆటో ట్రాన్స్ మిషన్ పై రూ.33,000 తగ్గింపు చేశారు. గ్రాండ్ ఐ 10 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో లభిస్తుంది.

హ్యుందాయ్ కి చెందిన మరో కారు టక్సన్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.0 డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇవి రెండూ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ పై పనిచేస్తాయి.ఈ మోడల్ పెట్రోల్ కారుపై రూ.25,000, డీజిల్ వెహికల్ పై రూ.50,000 తగ్గింపును ప్రకటించారు. ఇదే కంపెనీకి చెందిన వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ మోడళ్ల కోనుగోలుపై తగ్గింపును ప్రకటించాయి. వీటిలో వెన్యూ టర్బో పెట్రోల్ వేరియంట్ పై రూ.50 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ పై రూ.40వేల తగ్గింపును ఇస్తున్నాయి. వెన్యూ ఎన్ లైన్ పై రూ.45,000 డిస్కౌంట్ ను ఇస్తున్నాయి.

హ్యుందాయ్ ఐ 20పై రూ.50వేల తగ్గింపును పొందవచ్చు. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. హ్యుందాయ్ ఆరా మోడల్ పై రూ.48,వేల తగ్గింపును ప్రకటించారు. ఇది సీఎన్ జీ కొనుగోలుపై మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్ వేరియంట్ పై రూ.28 వేల వరకు తగ్గించారు. హ్యుందాయ్ వెర్నాపై రూ.40 వేల వరకు డిస్కంట్ ను ఇవ్వనున్నారు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ పై 115 హార్స్ పవర్, 143 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.