KIA Cars: కియా కార్ల కోసం ఎగబడుతున్నారు.. ఆ మోడల్ కే డిమాండ్

కియా ఇండియా ప్రారంభించిన నాలుగు సంవత్సరాల్లో 95 దేశాలకు వివిధ మోడళ్లను ఎగుమతి చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 2 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.

Written By: Chai Muchhata, Updated On : April 27, 2023 2:54 pm
Follow us on

KIA Cars: దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుతున్న కార్లలో కియా నిలిచింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన కియాకు చెందిన కార్లు ఇండియాలో తయారైనవాటిని ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నారు. SUVలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఆకర్షించేందుకు కియా ఆకర్షించే మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిలో కియా సెల్టోస్, కియా సోనెట్, కియా కేరెన్స్ నెంబర్ 1,2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లను ఆదరించడంతో ఈ ఏడాది ఎగుమతులు బాగా పెరిగినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల కార్లు ఎగుమతిచేసి ఆటోమోబైల్ రంగంలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంటున్నారు.

కియా ఇండియా ప్రారంభించిన నాలుగు సంవత్సరాల్లో 95 దేశాలకు వివిధ మోడళ్లను ఎగుమతి చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 2 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. మధ్యప్రాచ్యం, మెక్సికో తదితర ప్రాంతాల నుంచి కియా ఇండియా కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కియా నుంచి ఎగుమతి చేసిన వాటిట్లో ‘సెల్టోస్’ ముందు వరుసలో ఉంది. ఈ మోడళ్లు అత్యధికంగా 1,35,885 యూనిట్లు ఎగుమతులు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా కియా ఇండియా ఛీప్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ వివరాలు వెల్లడించారు. భారతదేశంలో తయారవుతున్న కియా కార్లకు ప్రపంచంలో ఆదరణ పెరుగుతున్నాయన్నారు. కంపెనీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన మోడళ్లలో కియా సెల్టోస్ ఉత్తమమైనదిగా నిలుస్తోందని చెప్పారు. ఈ నాలుగు సంవత్సరాల్లో సెల్టోస్ విక్రయాలు అగ్రగామిగా ఉన్నట్లు తెలిపారు.

కియా సెల్టోస్ మొత్తం ఎగుమతుల్లో 68 శాతం ఎగుమతులు కాగా.. 53 శాతం దేశీయంగా విక్రయాలు జరిగాయని అన్నారు. ఇక కియా సోనెట్ 54,406 యూనిట్లు, కియా కేరెన్స్ 8,230 యూనిట్లు అమ్ముడుపోయాయని అన్నారు. కంపెనీ గత ఏడాది తో పోలిస్తే 22 శాతం విక్రయాలు పెరిగినట్లు చెప్పారు. గత డిసెంబర్ లో అత్యధికంగా 9462 యూనిట్లను విక్రయాలు జరిపిందని ఆయన వివరించారు.