Tesla Mumbai Showroom: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు తన మొదటి షోరూమ్‌ను భారతదేశంలో ప్రారంభించింది. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ నేడు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో ఈ షోరూమ్‌ను ప్రారంభించనున్నారు. ముంబైలోని ఈ కమర్షియల్ ఏరియాలో టెస్లా తన మొదటి టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, ఈ షోరూమ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఒక సర్వీస్, వేర్ హౌస్ సెంటర్ ను కూడా రెడీ చేసింది.
షోరూమ్‌లో ఏమున్నాయి?
టెస్లా ఇటీవల కాలంలో చైనా, అమెరికా నుంచి మిలియన్ డాలర్ల (సుమారు రూ.8కోట్ల) విలువైన వస్తువులను భారతదేశానికి దిగుమతి చేసుకుంది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు, ఛార్జింగ్ పరికరాలు, ఇతర యాక్సెసరీలు ఉన్నాయి. కంపెనీ కేవలం షోరూమ్ ఓపెన్ చేయడం మాత్రమే కాకుండా భవిష్యత్తు కోసం ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తీసుకున్న కార్లకు సర్వీస్ సపోర్ట్‌పై కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా టెస్లా తమ కంపెనీ తరఫున అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ వై 6 యూనిట్లను భారతదేశానికి తెప్పించింది. ఈ కార్లను షోరూమ్‌లో కస్టమర్ల కోసం ప్రదర్శనకు ఉంచనున్నారు.
Also Read: Starlink satellite: ఇండియా ను దోచెయ్యడానికి సిద్దమవుతున్న ఎలాన్ మస్క్!
టెస్లా మోడల్ వై రేంజ్, స్పీడ్
టెస్లా మోడల్ వై, కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది పవర్ ఫుల్ రేంజ్, పర్ఫామెన్స్ తో వస్తుంది. ఇది లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జి చేస్తే 574 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా, ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
Tesla showroom, Mumbai. Looking very fly. Can’t wait to buy a few cars ASAP. pic.twitter.com/v2Pebmmfmo
— Ankit Jxa (@kingofknowwhere) July 11, 2025
ఇండియాకు టెస్లా ఎందుకంత ముఖ్యం ?
టెస్లా మన దేశంలోకి రావడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే, కార్ లవర్స్ సుదీర్ఘ నిరీక్షణకు ఇది స్వస్తి పలికినట్లు అవుతుంది. ఇప్పుడు భారతీయ కస్టమర్లు టెస్లా కార్లను దగ్గరగా చూడవచ్చు, టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు.. డబ్బులుంటే కొనుగోలు కూడా చేయవచ్చు. వాస్తవానికి 2016 నుంచే టెస్లా భారతదేశంలోకి వస్తుందనే వార్తలు వినిపించాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ మోడల్ 3 కోసం అంతర్జాతీయ ప్రీ-బుకింగ్‌లను స్టార్ట్ చేసినప్పుడు, వేలాది మంది భారతీయులు ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. ఇప్పుడు, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, టెస్లా అధికారికంగా భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ కస్టమర్ల ఆశలు మళ్లీ చిగురించాయి.
Also Read: Indians Global Companies: గ్లోబల్ కంపెనీలను నడిపిస్తున్న భారతీయులు..
టెస్లా కారు రేటెంత ?
నిజానికి భారతదేశంలో పూర్తిగా తయారైన విదేశీ కార్ల మీద ప్రభుత్వం దాదాపు 70 శాతం దిగుమతి పన్ను వేస్తుంది. దీనివల్ల టెస్లా మోడల్ వై కారు ధర రూ.46 లక్షల నుంచి రూ.56 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టెస్లా ఇప్పటివరకు ప్రీ-బుకింగ్, టెస్ట్ డ్రైవ్ లేదా సేల్స్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈరోజు షోరూమ్ ప్రారంభంతో ఈ ప్రశ్నలకు అన్ని సమాధానాలు లభించే అవకాశం ఉంది. టెస్లా రాకతో దేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. దీంతో దేశంలో ఈవీ మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Tesla’s first India showroom in BKC, Mumbai. pic.twitter.com/XOWXY5N27V
— Indian Tech & Infra (@IndianTechGuide) July 15, 2025