Balayya movie records: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో బాలయ్య బాబు(Balayya Babu) ఒకరు… తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ అందరికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఒకప్పుడు బాలయ్య సక్సెస్ లను సాధించినప్పటికి 2005 నుంచి 2010 వరకు ఒక 5 సంవత్సరాలపాటు వరుసగా ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఇక ఆయన కెరియర్ అయిపోయింది అని అనుకున్న సందర్భంలో బోయపాటి శ్రీను తో ఆయన చేసిన సింహా సినిమాతో మరోసారి బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు…ఇక ఆ తర్వాత నుంచి వెనుతిరిగి చూడకుండా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంతు కేసరి, డాకు మహారాజు లాంటి నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇప్పుడు అఖండ 2 సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… తన ఎంటైర్ కెరియర్ లో ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు… రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య బాబు ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు.
Also Read: ఓజీ’ కి ఉన్నంత క్రేజ్ ‘హరి హర వీరమల్లు’ కి ఎందుకు లేదు..? పొరపాటు ఎక్కడ జరిగింది?
ఇక రీసెంట్ గా బాలయ్య బాబు ఒక షో లో రాజమౌళిని ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో మగధీర (Magadheera) మూవీ కథని ముందుగా నాకు వినిపించారని కానీ అనుకుని కారణాల వల్ల మీరు ఆ సినిమా నాతో చేయలేదని బాలయ్య బాబు చెప్పడం విశేషం…
ఒకవేళ అప్పట్లోనే బాలయ్యతో మగధీర సినిమా చేసినట్లయితే బాలయ్య బాబు ఆల్ టైం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారేవాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం మగధీర రామ్ చరణ్(Ram Charan) కు మాత్రమే సెట్ అయిందని, బాలయ్య బాబుకి సెట్ అయ్యేది కాదని వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రవితేజ చేసిన సినిమాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?
మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర వహిస్తున్నాడు…