https://oktelugu.com/

Ships: అంత బరువున్న ఓడలు సముద్రంపై ఎలా తేలియడుతూ ప్రయాణిస్తాయి?

Ships ఓడ నిర్మాణాన్ని ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా చేస్తారు. ఓడ నిర్మాణంలో ఆకారం, బరువు వంటివి ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Written By: , Updated On : March 20, 2025 / 07:00 AM IST
Ships

Ships

Follow us on

Ships: విమానాలు అభివృద్ధి చెందకమందు.. సరీకి రవాణాకు సముద్ర యానమే అనుకూలంగా ఉండేది. పైగా ఓడల ద్వారా సరుకుల రవాణా అప్పట్లో జోరుగా సాగేది. ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గలేదు.

నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో సరుకు రవాణా అనేది మరింతగా పెరిగిపోయింది. లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా సముద్రం ద్వారా వస్తువులను బట్వాడ చేయడం ఎక్కువైపోయింది. ఓడల ద్వారానే సరుకులను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే ఈ ఓడలు అత్యంత బరువుగా ఉంటాయి. అలాంటప్పుడు నీటిలో ఎలా తేలియాడుతూ ప్రయాణిస్తుందనేది చాలామందికి ఉండే అనుమానం. అయితే ఓడ ఎంత బరువున్నా.. అది సముద్రం మీద తేలియాడుతూ ప్రయాణించడానికి ప్రధాన కారణం ఆర్కిమెడిస్ సూత్రం.. ఆ సూత్రం ప్రకారం ఒక వస్తువును నీటిలో ముంచినప్పుడు.. దానికి తగ్గట్టుగా ద్రవ్యరాశి ఉన్న ద్రవాన్ని తొలగించినట్టు అవుతుంది. అంటే వస్తువు అగ్రవాన్ని తన కిందికి నెట్టివేస్తుంది. ఈ నెట్టి వేసిన ద్రవం వస్తువుపై పైకి ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. దీనిని భౌతిక శాస్త్ర పరిభాషలో ఉద్దీపన బలం అంటారు. వాస్తవానికి ఓడ నిర్మాణాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తుంటారు. ఓడ లోపలి భాగం ఖాళీగా ఉండేలాగా చూస్తారు. ఖాళీ భాగంలో గాలి ఉంటుంది. గాలి బరువు నీటితో పోల్చినప్పుడు తక్కువ. ఓడ సగటు సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల నీటిలో ఓడ మునిగిపోకుండా తేలియాడుతూ ఉంటుంది. ఓడ ఆకారం కూడా నీటిలో తేలియాడుతూ ఉండడానికి సహాయపడుతుంది. ఓడ కింది భాగం వెడల్పుగా ఉంటుంది. పై భాగం ఇరుకుగా ఉంటుంది. దీనివల్ల సముద్రపు నీటిలో ఓడకు పైకి నెట్టే బలం కలుగుతుంది. ఓడలో బరువు అనేది రెండు వైపులా ఒకే విధంగా ఉండాలి. ఒకేవైపు గనుక బరువు ఉంటే ఓడ మునిగిపోయే అవకాశం ఉంటుంది.

ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా….

ఓడ నిర్మాణాన్ని ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా చేస్తారు. ఓడ నిర్మాణంలో ఆకారం, బరువు వంటివి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక చిన్న రాయి నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతుంది.. దానికి కారణం రాయి సాంద్రత కంటే, నీటి సాంద్రత ఎక్కువగా ఉండటమే. అందువల్ల రాయి నీటిని స్థానభ్రంశం చెందించడానికి తగినంత ఉత్ప్లవ బలాన్ని పొందలేదు. దానివల్ల వెంటనే అది మునిగిపోతుంది. ఇక ఓడ నిర్మాణంలోనూ ఎన్ని పగడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో సముద్ర అంతర్భాగంలో ఉన్న మంచు శిలలు గుద్దుకొని మునిగిపోతుంటాయి. టైటానిక్ షిప్ ప్రమాదమే అందుకు బలమైన ఉదాహరణ. ఇవే కాకుండా కొన్ని సందర్భాలలో సముద్ర జలాలు అతలాకుతలంగా ఉండడం కూడా ప్రమాదాలకు దారి తీస్తాయి. ఇంజన్లలో చోటు చేసుకునే వైఫల్యం కూడా ఓడలలో ప్రమాదాలకు కారణమవుతుంది. అందువల్లే నేటి కాలంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఓడలను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. ఇంధనం కూడా తక్కువ వినియోగించే విధంగా రూపొందిస్తున్నారు.