Tata Motors: దేశంలోని కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకీ. దశాబ్దాలుగా ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లోని కంపెనీనలకు ధీటుగా ముందుకు సాగి నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చిది. అయితే తాజాగ మారుతి స్థానం వెనక్కి వెళ్లింది. ఇన్నాళ్లు ఎదురులేని మారుతికి టాటా మోటార్స్ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ పై చేయి సాధించి అగ్రగామిగా నిలిచింది. ఈ క్రమంలో మారుతి సుజుకీ రెండో స్థానానికి పడిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..
కొన్ని నెలలుగా కారు కొనాలనుకునేవారు హ్యాచ్ బ్యాక్ ల కంటే ఎస్ యూవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. బడ్జెట్ కు అనుగుణగా కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో టాటా మోటార్స్ SUV ల కార్లఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. ఓ వైపు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తూనే.. మరోవైపు పెట్రోల్ వాహనాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వినియోగదారులు టాటా మోటార్స్ ఉత్పత్తి చేసే కార్లపై మక్కువ చూపారు. 2023 ఏడాది నవంబర్ లో నష్టాలు చూసిన టాటా మోటార్స్ ఇప్పుడు రూ.3,24,635 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం టాటా మోటార్స్ మార్కెట్ విలువ 3,14,635 కోట్లు ఉంది. ఇందులో టాటా మోటార్స్ విలువ రూ.2,85,515.64 కోట్లు. టాటామోటార్స్ లిమిటెడ్ డీవీఆర్ విలువ 28,119.42 కోట్లు. మారుతి మార్కెట్ విలువ ప్రస్తుతం 3,13,058.50 కోట్లు ఉంది.దీంతో టాటా మోటార్స్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకోగా.. మారుతి సుజుకీ రెండోస్థానంలోకి వచ్చింది. గత సంవత్సరాలుగా ఎదురులేకుండా కొనసాగిన మారుతి.. ఇప్పడు రెండో స్థానానికి పడిపోవడంతో చర్చనీయాంశంగా మారింది.
టాటా మోటార్స్ తో సహా చాలా కంపెనీలు Electric Vehicle (EV)లు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం వీటి హవా పెరిగిపోతుంది. వినియోగదారులు సైతం ఈవీలపై ఎక్కువగా దృష్డి పెడుతున్నారు. ఈ పరిస్థితిని టాటా మోటార్స్ బాగా గ్రహించి ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మారుతి కంపెనీ ఇంత వరకు ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాలేదు. మారుతి సాంప్రదాయక విధానం ఇబ్బంది పెడుతోందని వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ కు చెందిన వ్యూహకర్త క్రాంతి బతిని అభిప్రాయపడ్డారు.