https://oktelugu.com/

Tata Curve SUV : టాటా కర్వ్ ఎస్ యూవీ కూపే.. అదిరిపోయే ఫీచర్స్.. ఆకట్టుకునే మైలేజ్..

స్పోర్టీ లుక్ లో కనిపించే టాటా కర్వ్ ఎస్ యూవీ కూపేలో రెండు పెట్రోల్ , ఒక డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. వీటిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ రెవోట్రాన్ నేచురల్ఖ అస్పిరేటేడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది మొదటి పెట్రోల్ ఇంజిన్ నుంచి 125 బీహెచ్ పీ పవర్ 225 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 23, 2024 / 04:31 PM IST

    Tata Curve SUV Coupe

    Follow us on

    Tata Curve SUV : దేశంలో కార్ల విక్రయాల్లో టాప్ 10 లో కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి. దేశీయ కంపెనీ అయిన దీని నుంచి ఇప్పటి వరకు ఆకట్టుకునే మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. టాటా నుంచి ఎస్ యూవీ కార్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ కంపెనీ నంచి లేటేస్ట్ గా కర్వ్ ఎస్ యూవీ కూపే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. డీజిల్ వెర్షన్లో రిలీజ్ అయిన ఈ కారును కొనుగోలు చేసిన తరువాత చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్ తో ఉన్న ఈ కారు మరింత ఆకర్షిస్తుందని అంటున్నారు. సేప్టీ ఫీచర్లతో పాటు బూట్ స్పేస్ ఎక్కువగా ఉన్న ఈ వెహికల్ లో లాంగ్ జర్నీ హాయిగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ కారు పూర్తి డీటేయిల్స్ లోకి వెళితే..

    స్పోర్టీ లుక్ లో కనిపించే టాటా కర్వ్ ఎస్ యూవీ కూపేలో రెండు పెట్రోల్ , ఒక డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. వీటిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ రెవోట్రాన్ నేచురల్ఖ అస్పిరేటేడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది మొదటి పెట్రోల్ ఇంజిన్ నుంచి 125 బీహెచ్ పీ పవర్ 225 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండో పెట్రోల్ ఇంజిన్ 120 బీహెచ్ పీ పవర్, 170 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 118 బీహెచ్ పీ పవర్ 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    ఈ కొత్త కారు ఎక్సీటీరియర్ లో ఎల్ ఈడీ డీఆర్ఎస్ కనెక్ట్ చేయబడిన హెడ్ లైట్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ కు ఇరువైపులా హెడ్ ల్యాంపులు ఉన్నాయి. గ్రిల్ పై క్రోమ్ యాక్సెంట్స్ సాప్ట్ నెస్ ను పెంచుతాయి. గ్రిల్ వద్ద ఎయిర్ వేస్ ఉంది. 18 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్, అసాధారణమైన బ్రేకింగ్ పనితీరు, డిస్క్ బ్రేకింగ్ ఎస్ యూవీ కూపే స్టైలిష్ తో కూడుకొని ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికొస్తే 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్టు చేస్తుంది. 10 అంగుళాల డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ కు అవసరమైన సమాచారం ఇస్తుంది. ఇందులో మొత్తం 9 జేబీఎల్ స్పీకర్లు ఉన్నాయి. సౌకర్యవంతమైన లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్ ఆకర్షిస్తుంది.

    టాటా కొత్త కారు సేప్టీలోనూ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఇందులో రక్షణ కోసం 2 ఆడాస్ టెక్నాలజీని అమర్చారు. స్టాప్ అండ్ గో ఆడాప్టిన్ క్రూయిస్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ , 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి సౌకర్యాలను కలిగి ఉంది. డ్రైవింగ్ చేసేవారికి మంచి అనుభూతి కలిగించేలా దీనిని అమర్చారు. ఇక దీని మైలేజ్ గురించి మాట్లాడితే లీటర్ ఇంధనానికి 34.5 కిలోమీటర్లు ఉంది. దీనిని రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.