Dhruva: ధృవ లో విలన్ పాత్రను మిస్ చేసుకున్న తెలుగు స్టార్ హీరో… అది చేసి ఉంటే ఆయన లైఫ్ వేరేలా ఉండేదా..?

తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి కొంతమంది మాత్రమే స్టార్ హీరోలు ఉన్నారు...నిజానికి వాళ్ళు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ లను అందుకోవడమే కాకుండా భారీ రికార్డ్ లను కూడా క్రియేట్ చేస్తాయి...

Written By: Gopi, Updated On : September 23, 2024 4:32 pm

Dhruva

Follow us on

Dhruva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈయన భారీ సినిమాలను చూసి సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ధృవ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ వైవిధ్యమైన కథాంశాన్ని సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అంతకుముందు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేసిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఒక్కసారిగా చేంజ్ ఓవర్ ని చూపిస్తూ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమాని చాలా డిఫరెంట్ జానర్ లో తెరకెక్కించి మొత్తానికైతే సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలిపాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు భారీ సక్సెస్ ని సాధించినప్పటికి ఇక తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆయన ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆ సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ధృవ సినిమా భారీ విజయాన్ని సాధించినప్పటికి మొదటగా విలన్ పాత్ర కోసం యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిన రాజశేఖర్ ని తీసుకోవాలని చూశారట. కానీ రాజశేఖర్ మాత్రం అప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న సమయం కాబట్టి నేను విలన్ పాత్రలను చేయనని కరాకండిగా చెప్పడంతో ఆ పాత్రలో అరవింద్ స్వామిని తీసుకోవాల్సి వచ్చింది.

నిజానికి తమిళం లో వచ్చిన ‘తని ఒరవన్ ‘ సినిమాకి రీమేక్ గా ‘ధృవ ‘ సినిమా తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమాలో ఆయన అయితేనే బాగుంటాడని అనుకొని మళ్ళీ అరవింద్ స్వామి తోనే ఆ పాత్రని చేయించారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక డిఫరెంట్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను రాజశేఖర్ చేసి ఉంటే ఆయన జాతకం మారిపోయేది అంటూ చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ ని రామ్ చరణ్ వాడుకుంటూ వరుసగా భారీ సక్సెస్ లను అందుకుంటు స్టార్ హీరో గా ఎదిగాడు. ఇక ‘గ్లోబల్ స్టార్’ గా కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి పోటీనిస్తూ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ ఫైవ్ హీరోల్లో ఒకడి గా తను కూడా కొనసాగుతుండటం విశేషం…