Devara First Review: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మేనియా నే కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ నుండి ఆరేళ్ళ తర్వాత విడుదల అవ్వబోతున్న సోలో చిత్రం కావడంతో కేవలం అభిమానులు మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే ఓవర్సీస్ లో మొదలై సంచలన రికార్డ్స్ ని నమోదు చేసింది. నిన్న కర్ణాటక, చెన్నై వంటి ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, కర్ణాటక లో బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోపే కోటి రూపాయిల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు సెలెక్టెడ్ ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి స్థాయి బుకింగ్స్ బుధవారం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రానికి టికెట్ హైక్స్, బెన్ఫిట్ షోస్, అదనపు షోస్ కి సంబంధించిన అనుమతులు కూడా ఇచ్చేసింది. ఇక ఆల్ టైం రికార్డ్స్ పెట్టడం ఒక్కటే బ్యాలన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోని ఇటీవలే కొంతమంది బయ్యర్స్, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా వేసి చూపించారట.
ఈ షో నుండి వచ్చిన టాక్ ని చూస్తుంటే ‘దేవర’ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ థియేట్రికల్ అనుభూతి కలిగిస్తుందని, ఎన్టీఆర్ నట విశ్వరూపం తాలూకు స్టామినా కి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు. పవర్ ఫుల్ ‘దేవర’ గా, అలాగే అమాయకుడిగా ఎన్టీఆర్ నటించిన తీరు అద్భుతంగా అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే ‘దేవర’ ఒక ఊరికి పెద్దగా ఉంటూ, సముద్ర సామ్రాజ్యానికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. సముద్ర సంపదని అక్రమంగా దోచుకోవడానికి అతను అంగీకరించడు. ‘దేవర’ మాటను కాదని ఎవ్వరూ అలాంటి కార్యక్రమాలు చేసేందుకు సాహసించరు. అయితే అతని అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉండే ‘బైరా(సైఫ్ అలీ ఖాన్)’ ‘దేవర’ కు తెలియకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం దేవర కు తెలియడం తో అతన్ని దొంగ దెబ్బ తీసి చంపేస్తారు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు దేవర కొడుకు ‘వర’ ని తన అనుచరుడిగా పెట్టుకుంటాడు భైరా. అయితే ‘వర’ అనుచరుడిగా వచ్చినప్పటి నుండి భైరా సైన్యం లో ఉన్నోళ్లు మొత్తం ఒక్కొక్కరిగా హత్య కి గురి కాబడుతారు. ఆ హత్యలు చేస్తున్నది ఎవరు?, ‘వర’ నే తన తండ్రి ని చంపినందుకు ప్రతీకారం గా ‘భైరా’ అనుచరుడిగా నటిస్తూ ఇవన్నీ చేస్తున్నాడా?, లేదా ‘దేవర’ నే ఇవన్నీ చేస్తున్నాడా? అనేది సస్పెన్స్ గా ఉండబోతుంది. స్టోరీ వింటుంటేనే ఎంతో ఆసక్తి గా ఉంది కదూ!, స్క్రీన్ ప్లే కూడా కొరటాల శివ ఆ రేంజ్ లోనే పరుగులు పెట్టించాడని టాక్. అంతే కాదు ఈ చిత్రం లో తల్లి సెంటిమెంట్ కూడా బాగా పండిందట. ఫ్యామిలీ ఆడియన్స్ అందుకోసం క్యూ కడుతారని అంటున్నారు, చూడాలి మరి.